టెలినార్‌ సరికొత్త ఆఫర్లు

Telenor
Telenor

హైదరాబాద్‌: టెలికాం సేవలను అందించే టెలినార్‌ ఇండియా సోమవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని
ఇప్పటికే ఉన్న కస్టమర్లు, కొత్త కస్టమర్ల కోసం పలు అన్‌లిమిటెడ్‌ పథకాలను ప్రారంభించింది. ఎస్‌టివి 143పథకంలో
చేరడం ద్వారా ఈ సర్కిళ్లో ఇప్పుడున్న టెలినార్‌ కస్టమర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌ ఎస్‌టిడి కాల్స్‌తోపాటు 28రోజుల పాటు
2జిబి హైస్పీడ్‌ 4జి డేటా సర్వీసును కూడా పొందుతారు. కొత్త కస్టమర్ల కోసం ఎఫ్‌ఆర్‌సి 148పథకంలో కూడా టెలినార్‌
ఇవే ప్రయోజనాలను అందిస్తోంది. హైయూజ్‌ కస్టమర్ల కోసం ఈ సంస్థ ఎఫ్‌ఆర్‌సి 448 పథకాన్ని కూడా ప్రారంభించింది.
కొత్త ప్రవేశపెట్టిన ఈ మొట్టమొదటి రీఛార్జి పథకంలో అపరిమితమైన లోకల్‌ ఎస్టిడి కాల్స్‌తో పాటు 84రోజుల పాటు
రోజుకు 1జిబిడేటా చొప్పున హైస్పీడ్‌ 4జి డేటాను కూడా పొందవచ్చు.