టెలినార్‌ ఫుల్‌పైసా వసూల్‌ ఆఫర్‌!

telenor
telenor

టెలినార్‌ ఫుల్‌పైసా వసూల్‌ ఆఫర్‌!

హైదరాబాద్‌,జూలై 22: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల వినియోగదారులకోసం టెలినార్‌ ఫుల్‌ పైసా వసూల్‌ టారిఫ్‌, టాక్‌ టైమ్‌ఆఫర్లను ప్రవేశపెట్టింది. 84 రోజులపాటు దేశవ్యాప్తంగా కాల్స్‌ ను రెండుసెకన్లకు ఒకపైసా చొప్పున ఛార్జిచేస్తూ ఎస్‌టివి 29 ను ప్రవేశపెట్టింది. కస్టమర్లు బహుళస్కీంలు ప్యాక్‌లు ఎంచుకోవడంతోపాటు పూర్తి టాక్‌టైమ్‌కంటే ఎక్కువ విలువలు పొందే అవకాశంఉంది. పూర్తిటాక్‌టైమ్‌ ఆఫర్లు 60 రూపాయలతో ప్రారంభంఅయి 110 రూపాయ లతో మరింతటాక్‌టైమ్‌ ఆఫర్లువస్తాయని కంపెనీ హెడ్‌ శ్రీనాధ్‌ కొటియన్‌ వెల్లడించారు. కస్టమర్లు తమకు దగ్గరలోని ఏదేని రీఛార్జిదుకాణానికి వెళి తే పొందేఅవకాశం ఉందని, లేని పక్షంలో కస్టమర్లు స్టార్‌121హ్యాష్‌కు డయిల్‌ చేయడంద్వారా ఈ పాక్‌ లు కోరుకోవచ్చన్నారు. టెలినార్‌ కు 236 సొంత స్టోర్లతోపాటు 51 వేలకుపైగా రీఛార్జీదుకాణాలు ఎపి, తెలంగాణల్లో ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో 4.75 మిలియన్ల కస్టమర్లకు తాము సేవలంది స్తున్నట్లు శ్రీనాధ్‌ వెల్లడించారు. రూ.110నుంచి రూ.300 వరకూ అదనపు టాక్‌టైమ్‌ ఓచర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.