టెలినార్‌ నుంచి మరో కొత్త ప్లాన్‌

TELENOR
TELENOR

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆర్థిక ప్రయోజనాలను అందించే ఒక సరికొత్త ప్లాన్‌ ఎస్‌టివి94ను టెలినార్‌ ఇండియా బుధవారం ఆవిష్కరించింది. 28 రోజుల వ్యాలిడిటి కలిగి ఉండే ఈ ప్లాన్‌ కేవలం రూ.94కే అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌ను అందిస్తుంది. ఇదే కాకుండా టెలినార్‌ 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే అపరిమితమైన లోకల్‌, ఎస్‌టిడీ కాల్స్‌ను అందించే ఎస్‌టివి299, అలాగే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌తో పాటు 2జిబి 4జి డేటాను కూడా అందించే ఎస్‌టివి 143 లాంటి పథకాలను కూడా అందిస్తోంది.