టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో పెరుగుతున్న పోటీ

Telecom Tower
telecom

టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో పెరుగుతున్న పోటీ

న్యూఢిల్లీ,అక్టోబరు 1: టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం పరంగా మూడో రౌండ్‌లోనికి వేలంప్రక్రియ ప్రవేశించింది. 2100 ఎంహెచ్‌ జడ్‌, 2500 ఎంహెచ్‌జడ్‌ వేలం ప్రక్రియ ఊపందుకుంది. ఎక్కువశాతం వేలంలో 1800 ఎంహెచ్‌జడ్‌కే డిమాండ్‌ ఉన్న ట్లు తేలింది. ఇప్పటివరకూ ప్రీమియం 700 ఎంహెచ్‌జడ్‌ బాండ్‌లో బిడ్లు దాఖలు కాలేదు. 1800 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌ లోనే ఎక్కువ బిడ్లు దాఖలయ్యాయి. ముంబై సర్కిల్‌కోసం ఎక్కువ వచ్చాయి. పదిబిడ్లు 2100 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌కు దాఖలైనట్లు తేలింది. టెలికాం కార్యదర్శి జెఎస్‌ దీపక్‌ మాట్లా డుతూ స్పెక్ట్రమ్‌ కొరత కారణంగా సేవల్లో నాణ్యతపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. మొత్తం రిలయన్స్‌జియో, ఎయిర్‌ టెల్‌, ఆర్‌కామ్‌దేశవ్యాప్త స్పెక్ట్రమ్‌తో ఉన్నాయి. వొడాఫోన్‌, ఐడియా సెల్యులర్‌లు తమతమ 4జిస్పెక్ట్రమ్‌ విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకూ కంపెనీలు మొత్తం 14,653 కోట్లు ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌గా చేసాయి. ఆర్‌జియో ఒక్కటే 6500 కోట్లు జమ చేసింది. టెలికాం రంగంలో భారీ ఎత్తున పోటీ నెలకొన్న స్పెక్ట్ర మ్‌ వేలంను టెలికాం శాఖ ప్రారంభించింది. రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌, ఐడియా సెల్యులర్‌, భారతి ఎయిర్‌టెల్‌ బరిలో గట్టిపోటీని ఎదుర్కొంటున్నాయి. భావితరం టెలికాం వాయు తరంగాల వేలం ప్రక్రియపై టెలికాం రంగ నిపుణుల అంచనా ప్రకారం సుమారు 5.63 లక్షల కోట్లు రాబడులు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాబడికి పరిమితులు అంటూలేవని బిడ్డింగ్‌ మాత్రం ఉదయం తొమ్మిదిగంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకూ ప్రతిరోజూ జరుగుతుంది. అయితే మొదటిరోజు మాత్రం పదిగంటలకు ప్రారంభిస్తారు. టాటా టెలీ సర్వీసెస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌సెల్‌ సంస్థలు కూడా స్పెక్ట్రమ్‌ కొనుగోలులో పాల్గొనే అవకాశంఉంది. 2010 లో మాత్రమే 3జి ఎయిర్‌వేవ్స్‌కు నిర్వహించారు. 2100 ఎంహెచ్‌జడ్‌బ్యాండ్‌ వేలం 34రోజులపాటు కొనసాగింది. అన్ని స్పెక్ట్రమ్‌ బ్యాండ్ల వేలం అదే పద్ధతిలో కొనసాగుతాయి. ప్రతి రోజూ బిడ్డింగ్‌ ముగిసిన తర్వాత టెలికాంశాఖ ఫలితాలు వెల్లడి స్తుంది. 2354.55 మెగాహెర్ట్జ్‌ తరంగాలను వేలంకోసం ఏడు బాండ్లలో నిర్ణయించారు. అవి 7000 ఎంహెచ్‌జడ్‌, 800 ఎంహెచ్‌జడ్‌, 900 ఎంహెచ్‌జడ్‌, 1800ఎంహెచ్‌జడ్‌, 2100 ఎంహెచ్‌జడ్‌, 2300ఎంహెచ్‌జడ్‌, 2500ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్ర మ్‌లను ఎంపికచేసింది. ఈ రేడియో తరంగాలను 2జి, 3జి, హైస్పీడ్‌ 4జి మొబైల్‌ సేవలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రగంలోని నాలుగు పెద్ద టెలికాం కంపనీలు కలిగి ఉన్న స్పైక్ట్రమ్‌ కంటే ఈ మొత్తం పెద్దదిగా చెపుతున్నారు. జియో, ఎయిర్‌టెల్‌, ఆర్‌కామ్‌ దేశవ్యాప్తంగా 4జి స్పెక్ట్రమ్‌కు ప్లాన్‌చేస్తున్నాయి. వొడాఫోన్‌, ఐడియా సెల్యులర్‌ కంపెనీలు మాత్రం తమ 4జిసేవలు విస్తరించే పనిలో ఉన్నాయి. ఐడియా 4జి స్పెక్ట్రమ్‌ 22 సర్కిళ్లలో పదింటిలో ఉంది. వొడాఓన్‌ ఇటీ వలే 47,700 కోట్లు పెట్టుబడులు పెడుతున్నది. కేవలం తొమ్మిది సర్కిళ్లలో మాత్రమే 4జి సేవలందిస్తోంది ప్రభుత్వం దేశవ్యాప్తంగాస్పెక్ట్రమ్‌ వేలంకు 1800 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌లో 2873 కోట్లు, 900 ఎంహెచ్‌జడ్‌లో 3341 కోట్లు, 800 ఎంహచ్‌జడ్‌లో 5819 కోట్లు, 2100 ఎంహెచ్‌జడ్‌లో 2100 కోట్లు, 700ఎంహెచ్‌జడ్‌ 11,485కోట్లు, 2300 ఎంహెచ్‌జడ్‌, 2500 ఎంహెచ్‌జడ్‌ బాండ్లలో రూ.817 కోట్లు రూపాయలు బేస్‌ధరలు నిర్ణయించింది. ప్రీమియం 700 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ బేస్‌ధర 11,485 కోట్లుగా ఉంది. మొబైల్‌సేవల పంపిణీలో కూడా 2100 ఎంహెచ్‌జడ్‌ కంటే 70శాతం తక్కు వ ఉంటాయని అంచనా వేసింది. 3జి సేవలు అందుతాయి. 700 ఎంహెచ్‌జడ్‌ కొనుగోలుచేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీ కనీసం 57,425 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా 5ఎంహెచ్‌జడ్‌బాండ్‌ పొందే అవకాశం ఉంది. ఈ ఒక్క బాండ్‌లోనే సుమారు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. జియో ఒక్కటే ప్రస్తుతం దేశంలో 700 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు అర్హతను కలిగి ఉంది. బేస్‌ధరలపరంగానే మొత్తం స్పెక్ట్రమ్‌ రాబడులు గతంలో వచ్చిన 2.5లక్షల కోట్లకు నాలుగురెట్లు అధికంగా ఉంటాయని అంచనా. ప్రభుత్వం ఎక్కువధరలకే వేలం సాగ వచ్చన్న అంచనాతో ఉంది. గత ఏడాది మార్చినెలలోనే చిట్ట చివరి వేలంను నిర్వహించి 1.1 లక్షల కోట్లను సాధించింది. 1800 ఎంహెచ్‌జడ్‌, 2100 ఎంహెచ్‌జడ్‌, 2300 ఎంహెచ్‌ జడ్‌ స్పెక్ట్రమ్‌లలో వన్‌జిహెచ్‌జడ్‌ మించిన వాటికి 50శాతం ముందు చెల్లింపుచేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రెండేళ్ల మారిటోరియం అనంతరం 10ఏళ్లపాటు కొనసాగిం చాల్సి ఉంటుంది. అంతకుముందు వేలంపాటల్లో కంపెనీలు ముందుగా 33 శాతం చెల్లింపు చేయాలని నిర్ణయించారు. ఇక ఒక జిహెచ్‌జడ్‌ కంటే తక్కువ ఉన్న బాండ్లు 700 ఎంహెచ్‌జడ్‌, 800 ఎంహెచ్‌జడ్‌, 900 ఎంహెచ్‌జడ్‌ లలో కంపెనీలు 25శాతం ముందు చెల్లించాలి. మిగిలిన మొత్తం పదేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండేళ్ల మారి టోరియం కూడా ఉంటుందని టెలికాం వెల్లడించింది.