టెలికాం సంస్థల నుంచి నివేదికలు కోరిన TRAI

B209

టెలికాం సంస్థల నుంచి నివేదికలు కోరిన TRAI 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: మొబైల్‌ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, రిలయన్స్‌జియో సంస్థలు కాల్‌ట్రాఫిక్‌ డేటాను అందచేయాలని ట్రా§్‌ు ఆదేశించడంతో ఈ కంపెనీలు తమతమ కాల్‌ట్రాఫిక్‌ డేటా నివేదికలు అందచేశాయి. ఇంటర్‌ కనెక్షన్‌ పోర్టుల ఏర్పాటుపై వివిధ కంపెనీలు, జియోతో జరుగుతున్న పోరాటాన్ని పరిష్కరించేం దుకు ట్రా§్‌ు ఈ నివేదికలు కోరినట్లు సమాచారం. ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ నిమిషాలు మొత్తం ఈ భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, రిలయన్‌సజియో, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ సంస్థలునివేదికలు అందిచేటట్లు ట్రా§్‌ుప్రతినిధి వెల్లడించారు. ఇంట్రా యూసేజ్‌ ఛార్జీలపరంగా చూసేందుకు ఈనివేదికలు అవసరమవుతాయని అంచనా. అంతేకాకుండా ఐదు గురు టెలికాం ఆపరేటర్లు అందచేసిన ఈ నివేదికల వివరాలు బయటికి రానప్పటికీ ప్రత్యేకించి ఇంటర్‌ కనెక్ట్‌ వివాదాలేనని తెలుస్తోంది. రిలయన్స్‌ జియో తో ఇతర కంపెనీలు ప్రత్యక్ష పోరాటం చేస్తున్న సం గతి తెలిసిందే.
గడచిన నాలుగైదేళ్లలో ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ కాల్‌ట్రాఫిక్‌ ఒకేవిధంగా ఉంది. కొంద రు ఆపరేటర్లు మాత్రం ఆపరేటర్‌ వైస్‌ డేటా కావా లని కోరడంతో వివాదం మరింత రాజుకుంది. ఈ ఐదు కంపెనీలు ఈనెల 16వ తేదీనే నివేదికలు అందచేశాయి. ఇంటర్‌కనెక్షన్‌ యూసేజ్‌ ఛార్జీలపరం గా సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వివాదాన్ని లేవనెత్తడంతో ఈ నివేదికలు అనివార్యం అయ్యాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌పై కో§్‌ుచేసిన ఫిర్యాదులను పురస్కరించుకుని ఈ నివేదికలు అడిగినట్లు ట్రా§్‌ు వివరించింది. అంతే కాకుండా మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ రెండింటినీ కూడా ఒక మొబైల్‌యాప్‌సాయంతో నిర్వహించుకునే విధానం వల్ల ఎంతో నష్టం జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘించడమేనని బిఎస్‌ఎన్‌ఎల్‌ పై ఫిర్యాదుచేసింది. ఇతర టెలికాం నెట్‌వర్క్‌కు మొబైల్‌ కస్టమర్లు కాల్స్‌చేసుకునే ఈవిధానంపై కో§్‌ు తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇటీవలే బిఎస్‌ఎన్‌ఎల్‌తో ఆర్‌జియో ఒప్పందం చేసు కోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ఫిర్యాదులు చేసింది. నిమిషానికి 14 నిమిషాల ఐయుసి ఛారీలకంటే ఆర్‌జియోకు ఇతర ఆపరేటర్లు ఎక్కు వ ఛార్జీలు వసూలుచేస్తున్నారని ఆర్‌జియో ఆరో పించింది. అయితే ఆపరేటర్లు మాత్రం డేటా ట్రాఫిక్‌ పెరగడం వల్ల ఎక్కువ నిర్వహణ వ్యయం అవుతోందని అందువల్లనే ఎక్కువ ఛార్జీలు అవస రం అవుతాయని వాదిస్తున్నాయి. జియోనెట్‌ వర్క్‌ పైనే ఎక్కువ ట్రాఫిక్‌ అవసరం అవుతోంది.