టెలికాం షేర్లకు జియో విఘాతం

jio
jio

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో కొత్త గరిష్టాల హోరు కొనసాగుతూనే ఉంది.తాజాగా నిఫ్టీ 11,100స్థాయిని కూడా దాటేసింది. ఆరంభంలో కన్సాలిడేషన్‌ బాట పట్టిన మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి. ఈ క్రమంలో నిప్టీ ఈ గరిష్టాన్ని తాకింది. అయితే తీవ్ర ఊగిసలాటల మధ్య మార్కెట్లు మళ్లీ ఫ్లాట్‌గా మారాయి. మరోవైపు గురువారం డెరివేటివ్‌ కౌంటర్‌కు చివరి రోజు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతగా వ్యవహరిస్తున్నట్లు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మెటల్‌, ఆటో, నష్టపోతుండగా, బ్యాంక్స్‌, ఐటీ లాభాల్లో కొనసాగుతున్నాయి .దీంతో నిప్టీ బ్యాంకు కొత్త గరిష్టాన్ని తాకింది. కానీ ప్రాఫింట్‌బుకింగ్‌ కారణంగా నష్టాల్లోకి మళ్లింది. టిసిఎస్‌ షేరు కూడా ఆల్‌ టైంని తాకింది. మరోవైపు రిలయన్స్‌ జియో ప్రకటించిన రిపబ్లిక్‌ డే ఆఫర్లదెబ్బతో టెలికాం దిగ్గజాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. భారతీఎయిర్‌టెల్‌ 4శాతం క్షీణించి, ఐడియా 5శాతం పతనమై టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. వీటితోపాటు ఆర్‌కాం కూడా 2శాతం నష్టాలతో కొనసాగుతోంది.