టెలికం బిలియనీర్ల మధ్యనే స్పెక్ట్రమ్‌ వేలం

Telecom
Telecom

టెలికం బిలియనీర్ల మధ్యనే స్పెక్ట్రమ్‌ వేలం

భారతీయ టెలికం రంగ కుబేరులు ఎయిర్‌వేవ్స్‌ వేలంద్వారా 65,789 కోట్ల వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం రూ.5.6 లక్షలకు ఏమాత్రం చేరుకోలేదు. డాలర్లలో చూస్తే 9.9 బిలియన్‌ డాలర్లు మాత్రమే సేకరించింది. ఈసారి వేలంలో అనేక మొబైల్‌ ఫోన్‌ క్యారియర్లు వేలంలోకి రాలేదనే చెప్పాలి. నగదు నిల్వల పరిరక్షణతోపాటు పోటీ తీవ్రంగా ఉండటం వల్లనే చిన్నక్యారియర్లు పోటీకి దూరంగా ఉన్నట్టు అంచనా.. భారతి ఎయిర్‌టెల్‌ 14,244 కోట్లు స్ప్రెక్టమ్‌ వేలం బిడ్లు కొనుగోలు చేసింది. మూడోస్థానంలో ఉన్న ఐడియా సెల్యులర్‌మాత్రం తనకు అవసరమైనంత మేరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాగే రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మాత్రం 13,700 కోట్ల స్ప్రెక్ట్రమ్‌ కొనుగోలు చేసింది. ఈ వేలంలో వోడాఫోన్‌ భారతీయ యూనిట్‌ కూడ పాల్గొంది.