టిసిఎస్‌కు నాలుగో ఎండిసిఇఒ గోపీనాధన్‌

TCS111
Gopinathan

టిసిఎస్‌కు నాలుగో ఎండిసిఇఒ గోపీనాధన్‌

ముంబై: 49ఏళ్లక్రిందట స్థాపించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టిసిఎస్‌)లో నాలుగు పర్యా యాలు నాయకత్వ మార్పిడి జరిగింది. కంపెనీ సిఇఒ ఎండిగా రాజేష్‌ గోపీనాధన్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అంతర్జాతీయంగా ఐటిరంగంపై పెనుసవాళ్లు ముసురు కుంటున్న తరుణంలో గోపీనాధన్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆటోమే షన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పరంగా రంగానికి కొంత విఘాతం కలుగుతున్న దృష్ట్యా కొత్త సిఇఒ పనితీరుపైనే కంపెనీ వర్గాలు దృష్టి పెట్టాయి. వీటికితోడు మేజర్‌ మార్కెట్లలో సంక్లిష్ట వాతావరణం కూడా నడుస్తోంది. సరఫరా వ్యూహం పటిష్టంగా ఉన్నా మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. టిసిఎస్‌ సిఇఒగా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ బాధ్యతలు స్వీకరించిన సమయంలో గోపీనాధన్‌ మూడేళ్లపాటు సిఒఒగా పనిచేసా రు. దీనివల్లనే 2009లో సిఇఒగా వచ్చేందుకు చంద్రశేఖరన్‌కు సులువు అయింది. అయితే గోపీనాధన్‌ పరిస్థితివేరు. చంద్రశేఖరన్‌ కీలక టీమ్‌ మొత్తం ఫైనాన్స్‌హెడ్‌గా ఉంది. నిర్వహణ విభాగంలో ఆయన పనిచేయలేదు. అయినా ఎంత సంక్లిష్ట వాతావరణం ఉన్నా టిసిఎస్‌ను మార్కెట్‌ విలువలపరంగా నంబర్‌వన్‌ స్థానంలోనే కొనసాగించగలరన్న ధీమా వ్యక్తం అవుతోంది.