టివిఎస్‌ మోటార్స్‌కు పెరిగిన లాభం

TVS
TVS

టివిఎస్‌ మోటార్స్‌కు పెరిగిన లాభం

న్యూఢిల్లీ, జనవరి 31: చెన్నైకేంద్రంగా ఉన్న టివిఎస్‌ మోటార్‌కంపెనీ మూడోత్రైమాసికంలో 16.34 శాతం నికరలాభాలను ప్రకటించింది. 154.25కోట్ల రూపా యలుగా వెల్లడించింది. అమ్మకాలు వృద్ధి చెందడమే లాభాల పెరుగుదలకు కారణం. కంపెనీ అంతకు ముందు ఏడాది ఇదేకాలంలో 132.67 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇక రాబడులు పరంగాచూస్తే 3684.95 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదేకాలంలో 3239.55 కోట్లుగా లాభాలు ఆర్జించింది. ఈ త్రైమా సికంలో టూవీలర్‌ విక్రయాలు ఎగుమతులతో సహా 13.8శాతం పెరిగి 7.99 లక్షలకు చేరినట్లు వెల్లడిం చింది. మోటారు సైకిళ్ల విక్రయాలు 26.7శాతం పెరిగి 2.48 లక్షల యూనిట్ల నుంచి 3.14లక్షల యూనిట్ల కు పెరిగినట్లు వెల్లడించింది. స్కూటర్ల విక్రయాలు సైతం 2.21లక్షల నుంచి 2.69 లక్షలకు పెరిగాయి. త్రీవీలర్‌ విక్రయాలపరంగా 67.7శాతం వృద్ధిని నమోదుచేసింది. 26,968 యూనిట్లు విక్రయించిం ది. మొత్తం ఎగుమతులు పరంగాచూస్తే 1.40 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. 41.4శాతం వృద్ధిని నమోదు చేసింది. టివిఎస్‌మోటార్‌ కంపెనీ షేర్లు 0.81శాతం క్షీణించి రూ.713.90గా బిఎస్‌ఇలో కొనసాగాయి.