టాప్‌10లో 8 బ్రాండ్లు మారుతిసుజుకీవే!

MARUTI
MARUTI SUZUKI

టాప్‌10లో 8 బ్రాండ్లు మారుతి సుజుకీవే!

న్యూఢిల్లీ: మారుతిసుజుకి ఇండియా మార్కెట్‌లోని టాప్‌ 10 అమ్మకాల బ్రాండ్‌లలో ఎనిమిది మోడళ్లు నిలిచాయి. భారత్‌ టాప్‌ అమ్మ కాల పది బ్రాండ్లలో మారుతికి చెందిన వాహనాలే ఆరుమోడళ్లు ఉన్నాయి. ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో కంపెనీ మార్కెట్‌వాటా 50శాతానికి పెంచింది. ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య సియామ్‌ గణాంకాలప్రకారంచూస్తే మారుతి ఆల్టో అత్యుత్తమ బ్రాండ్‌గా జనవరినెలలో నిలిచింది. గత ఏడాది జనవరిలో 21,462 యూనిట్లు అమ్మకాలు సాగిన ఆల్టో ఈ ఏడాది 22,998 యూనిట్లు సాధించింది. కంపెనీ కంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ రెండోస్థానంలో నిలిచింది. 14,042 యూనిట్లనుంచి ఈ ఏడాది జనవరిలో 15,087 యూనిట్లకు చేరింది. చిన్నకార్లలో వ్యాగన్‌ ఆర్‌ మూడోస్థానంలో నిలిచింది. 14,390 యూనిట్లు విక్రయించింది.

ఏడాదిక్రితం ఈ బ్రాండ్‌ నాలుగో ర్యాంకులో నిలిచింది. ఇకమారుతిసుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాంక్‌ స్విఫ్ట్‌ నాలుగోస్థానంలో ఉంది. 14,545 యూనిట్లు విక్రయించింది. గత నెలలో 13,010 యూనిట్లు విక్రయించిన హుండై హ్యాచ్‌ బ్యాంక్‌గ్రాండ్‌ ఐ10 ఐదోస్థానంలో నిలిచింది. కం పెనీ 9934 యూనిట్లు గత ఏడాది విక్రయిస్తే ఈ ఏడాది గణనీయంగా పెంచుకుంది. కంపెనీ హ్యాచ్‌ బ్యాంక్‌ ఎలైట్‌ ఐ20 ఆరోస్థానంలో నిలతిచింది. 9604 యూనిట్లనుంచి 11,460 యూనిట్లకు చేరింది. ఇక మారుతిసుజుకి హ్యాచ్‌బ్యాక్‌ సెలీరియో ఏడోస్థానంలో నిలిచింది. 7141 యూనిట్లనుంచి 10,879యూనిట్లను విక్రయించింది. ఇక మరో హ్యాచ్‌బ్యాంక్‌ మారుతి బాలెనోకు ఎనిమిదో ర్యాంకు వెళ్లింది. 10,476 యూనిట్లు విక్రియంచింది. అంతకుముందు ఏడాది ఏడోస్థానంలో నిలిచింది. మారుతినుంచి వచ్చినమరో ఎస్‌యువి విటారా బ్రెజ్జా 8932యూనిట్లతో తొమ్మిదోస్థానంలో నిలిస్తే మినీ వ్యాన్‌ఒమ్మిన 8723యూనిట్లతో టాప్‌ టెన్‌ జాబితాలో నిలిచింది. హుండై క్రెటా, హోండాకార్స్‌ ఇండియా సిటీ వంటివి టాప్‌టెన్‌ మోడల్స్‌లోజనవరి జాబితాలో కనిపించలేదు. గత ఏడాది టాప్‌టెన్‌ మోడల్స్‌లో ఇవి నిలిచాయి. మార్కెట్‌ వాటాలపరంగా మారుతిసుజుకి ఇండియా 11,95,347 యూనిట్లను ఏప్రిల్‌ జనవరి మధ్యకాలంలో విక్రయించింది. మొత్తం పరిశ్రమ రంగపరంగా చూస్తే ఈ కాలంలో 25,08,845 యూనిట్లు విక్రయిస్తే మారుతి మరింతగాపెరిగింది. మార్కెట్‌ వాటా 47.64 శాతంగా ఉన్నట్లు సియామ్‌ అంచనా.