టాప్‌ ఏడు కంపెనీలటర్నోవర్‌లో రూ.63,751కోట్ల పెరుగుదల

SENSEX-N
SENSEX-N

న్యూఢిల్లీ: సెన్సెక్స్‌లోని టాప్‌ పది కంపెనీల్లో ఏడు కంపెనీల మార్కెట్‌ విలువలు 63,751.48 కోట్లు పెరిగాయి. గత వారం మార్కెట్లకు సెంటిమెంట్‌ బలంగాపనిచేయడంతో కంపెనీల షేర్లకు సైతం రెక్కలు వచ్చాయి. దీనితో కంపెనీ మార్కెట్‌ విలువలు అనుకోకుండా కోట్లల్లోనే పెరిగాయి. టిసిఎస్‌, మారుతిసుజుకి రెండు కంపెనీలకు భారీ లాభాలు వచ్చాయి. టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, మారుతి,హిందూస్థాన్‌యూనిలీవర్‌; స్‌బిఐ, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్‌ కంపెనీలు వాటి మార్కెట్‌ విలువల్లో పెరుగుదలను నమోదుచేసాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి కంపెనీలు స్వల్పనష్టాలుచవిచూసాయి. టిసిఎస్‌ మార్కెట్‌ విలువలు 17,601.88 కోట్ల రూపాయలు పెరిగి 5,05,33.64 కోట్లకు చేరింది. టాప్‌పది కంపెనీల్లో అతిపెద్ద లాభాలు గడించిందనే చెప్పాలి. ఇక మారుతిసుజుకి మార్కెట్‌ విలువలు సైతం 16,199.04 కోట్లుపెరిగాయి. 2,93,025.2 కోట్లకు చేరాయి. ఒఎన్‌జిసి 13,539,06 కోట్లుపెరిగి 2,48,194.77 కోట్లకు చేరాయి. ఎస్‌బిఐ మార్కెట్‌ విలువలు సైతం 6128.76 కోట్లుపెరిగి 2,76,096.24కోట్లకు చేరింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ 5735.87 కోట్లరూపాయలు పెరిగి 2,92,561.75 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువలపరంగాచూస్తే 3434కోట్లు పెరిగి 2,38,519.78 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 111.87 కోట్లకు చేరి 4,85,870.22 కోట్లకుచేరింది. ఇతరత్రా మార్కెట్‌ విలువల్లో హెచ్‌డిఎఫ్‌సిపరంగా 2315.73 కోట్లు దిగజారాయి. మొత్తం కంపెనీ టర్నోవర్‌ 2,72,832.23కోట్లుగా ఉంది. ఐటిసి కూడా 1706.35కోట్లు తగ్గి 3,20,976.47 కోట్లుగా నమోదయింది. రిలయన్స్‌ విలువల్లో 886.69 కోట్లు దిగజారి 5,81,732.30 కోట్లకు చేరింది. ర్యాంకింగ్‌లపరంగా పది సంస్థలో రిలయన్స్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. తదనంతరం టిసిఎస్‌,హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు, ఐటిసి, మారుతిసుజుకి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డిఎఫ్‌సి, ఒఎన్‌జిసి ఇన్ఫోసిస్‌లు నిలిచాయి. గతవారంలో సెన్సెక్స్‌ 477.33 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా 159.75 పాయింట్లు లాభపడింది. బిజెపి గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌రాష్ట్రాల్లో గెలిచినప్పటినుంచి స్టాక్‌ మార్కెట్లు రివ్వునపెరుగుతూనే ఉన్నాయి.