టాటా గ్రూప్ సంస్థలపై ఇన్వెస్టర్ల చూపు

టాటా గ్రూప్ సంస్థలపై ఇన్వెస్టర్ల చూపు
ముంబై,జూన్ 22:: లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్ల దృష్టి తాజాగా టాటాగ్రూప్ కౌంటర్లపై సారించారు. దీనితో బిఎస్ఇలో ప్రస్తుతం నెల్కో 20శాతం దూసుకెళ్లి రూ.96ను తాకితే టాటాఇన్వెస్ట్మెంట్ ఏడుశాతం ముందుకు దూకి రూ.764వద్దకు చేరింది. ఇదేబాటలో టిన్పేక్స్అండ్ కంపెనీ 5.6శాతం పైపైకి ఎగిసి రూ.94వద్ద నమోదయింది. టాటాపవర్ 4శాతం పెరిగి రూ.81వద్ద స్థిరపడితే టాటామోటార్స్ 3.7శాతం పెరిగి లాభంతో రూ.469వద్ద స్థిరపడింది. మిగిలిన కౌంటర్లలో టేయోరోల్ప్ 3.5శాతం పెరిగి రూ.58, టిఆర్ఎఫ్ 3.8శాతం పుంజుకి రూఏ.248, టైటన్ 3శాతం బలపడిఆ రూ.529కి చేరాయి. టాటాస్పాంజ్ ఐరన్ 1.2శాతంపెరిగి 825రూపాయలకు చేరింది. టాటాస్టీల్ 0.7శాతం పెరిగి రూ.523 వద్ద టాటా ఎలక్సీ 0.8శాతం పెరిగి రూ.1631 వద్ద, టాటాగ్లోబల్ 0.4శాతంపెరిగి రూ.157వద్ద, టాటాకమ్యూనికేషన్స్ ఒకటిశాతం బలపడి రూ.742వద్ద టిసిఎస్ యధాతథంగా రూ.2434వద్ద కదు లుతున్నాయి.
అలాగే వోల్టాస్ 0.8శాతం నష్టంతో రూ.470కి చేరితే టాటాకాఫీ ఒకటిశాతం క్షీణించి రూ.131వద్దకు చేరింది. టాటా మెటాలిక్స్ 0.5శాతం నీరసించి రూ.724.5వద్ద ట్రేడ్ అవుతున్నా యి. టాటాగ్రూప్షేర్లలో ర్యాలీకి ప్రత్యేకించి ఒక్కో కంపెనీకి ఒక్కో కారణం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్ఛేం జిలా వాటా విక్రయ వార్తలు టాటాపవర్కు జోష్నిచ్చాయి. యుఎస్ రక్షణరంగ దిగ్గజం లకీద్మార్టిన్తో టాటాగ్రూప్ఎఫ్16 బ్లాక్70 ఫైటర్ జెట్ల తయారీకి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో నెస్కో షేరుకు భారీ డిమాండ్ పుట్టినట్లు నిపుణులు చెపుతున్నారు. ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీలెన్స్,విశాట్ కనెక్టివిటీ, మెట్రో లాజికల్ సొల్యూషన్స్ తదితర ప్రభుత్వ, ప్రైవేటురరంగ సంస్థలకు అందిస్తోంది. దీనితో ఎఫ్-16ఫైటర్ల తయారీలో పలు పరికరాలను దేశీయంగానే సమకూర్చుకునేందుకు లఖీద్ టాటాగ్రూప్లు నిర్ణయించాయి. కాగా టాటాస్టీల్కు టాటామోటార్లో ఉన్న 8.36కోట్ల షేర్లను మాతృసంస్థ టాటాసన్స్కు విక్రయిస్తోంది.
డ్రైవర్ లెస్ కారు టెక్నాలజీ అభివృద్ధిలో భాగ స్వామి కావడంతో ఇటీవల టాటా ఎలెక్సీ జోరందుకున్న సంగతి తెలిసిం దే. ఇక జెఎల్ఆర్ పబ్లిక్ఇష్యూని చేపడుతున్నట్లు ఇప్పటికే టాటా మోటార్స్నుంచి వార్తలు వెలువడ్డాయి. అయితే ఆతర్వాత అటువంటిదేమీ లేదని స్పష్టంచేసింది. వైట్గూడ్స్ తయారీలోకి కూడా పెద్దఎత్తున ప్రవే శించడంతో టాటాకు చెందిన వోల్టాస్ ఇప్పటికీ ర్యాలీతీసింది. జిఎస్టిలో పసిడి ఆభరణాలపై పన్నును మూడు శాతానికిపరిమితం చేయడంతో టైటాన్ ఇప్పటికే దూసుకుపోతున్నది. ఇలాంటి పలు అంశాల ఆధారంగా టాటాగ్రూప్ ఇటీవల తీసుకుంటున్న పాలనాపరమైన చర్యలు ఈ కౌంటర్ల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తిని పెంచినట్లు నిపుణులు చెపుతున్నారు.