టాటా కెమికల్స్‌ లాభం రూ.343.02 కోట్లు

TATA
TATA

టాటా కెమికల్స్‌ లాభం రూ.343.02 కోట్లు

ముంబయి, మే 27: టాటాగ్రూప్‌ కంపెనీ టాటా కెమికల్స్‌ నాలుగో త్రైమాసికంలో నికరలాభం 31.82 శాతం పెరిగి 343.02కోట్లుగా ప్రకటిం చింది. అంతకుముందు ఏడాది 260.21 కోట్లు మాత్రమే సాధించింది. మొత్తం ఆదాయవనరులు స్వల్పంఆ క్షీణించాయి. జనవరి త్రైమాసికంలో రాబడులు 3618.14కోట్ల నుంచి 3079.47 కోట్లుగా ఉన్నాయి. అయితే ఖర్చుపరంగా తగ్గా యి. 3310.56 కోట్ల నుంచి 2733.96 కోట్లకు తగ్గించుకోగలిగింది. దీనివల్లనే నికరలాభం ఏడా ది మొత్తానికి 1001.11కోట్ల నుంచి 1234.10 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రకటించింది. పది రూపాయల ముఖవిలువ ఉన్న షేర్లపై 11రూపాయల డివిడెండ్‌ ప్రకటించింది. వాటాదారులు ఆమోదం పొందిన తర్వాత డివిడెండ్‌ చెల్లిస్తారు. వచ్చేఆగస్టు 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. రసాయనాలు, ఉప్పు, ఎరువుల తయారీలో నిమగ్నం అయిన టాటాకెమికల్స్‌టాటాగ్రూప్‌కంపెనీల్లో ఒకటి. పప్పు దినుసులు, మషాలాలను టాటాసంపన్న్‌ బ్రాండ్‌ పేరిట విక్రయిస్తోంది. కంపెనీ కొత్తగా మంచినీటి శుద్ధి యంత్రాల వ్యాపారంలోకి సైతం వస్తోంది.