టాటా ఎలక్సీ జూమ్‌

TATA
TATA

ముంబై: ఇంజినీరింగ్‌, ఎంబెడ్డెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా ఎలక్సీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన ఆకర్షణీ ఫలితాల కారణంగా లాభాలతో కళకళలాడుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 6.2శాతం పెరిగి రూ.1464 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.1469 వరకూ పెరిగింది. తొలి త్రైమాసికంలో టాటా ఎలక్సీ నికరలాభం 41 శాతం పెరిగి రూ.70 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 18శాతం పెరిగి రూ.382 కోట్లకు చేరింది.