టాటామోటార్స్‌ నుంచి ఎఎంటి బస్సులు

TATA
TATA

టాటామోటార్స్‌ నుంచి ఎఎంటి బస్సులు

ముంబయి,: టాటామోటార్స్‌ నుంచిఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌ మిషన్‌(ఎటిఎం) బస్సులను సైతం మార్కెట్‌కు విడుదలచేసింది. 9-12 మీటర్ల వైశాల్యంతో 23నుంచి 54 మంది ప్రయాణీకులను చేరవేసే సామర్ధ్యంతోఉంది. న్యూఢిల్లీ ఎక్స్‌షోరూంధరలుగా రూ.21లక్షలు ప్రకటిం చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి పిషరోడి మాట్లాడుతూ భారత్‌ వాణిజ్యవాహనరంగంలో టాటా మోటార్స్‌ కీలకపాత్ర పోషిస్తుందని, ఎఎంటి టెక్నాలజీ వాబ్‌కోతో తమ బస్సులు దీర్ఘకాలం మన్నేవిధంగా ఉత్పత్తి ఉంటుందన్నారు టాటామోటార్స్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ డా.అజిత్‌కుమార్‌ జిందాల్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ ఆధునిక టెక్నాలజీలకు ప్రతిరూపంగా ఎఎంటిబస్సులను రూపొందించినట్లు వివరించారు.