టాటామోటార్స్‌కు పిషరోడీ టాటా!

tata

టాటామోటార్స్‌కు పిషరోడీ టాటా!

ముంబయి, జూన్‌ 7: టాటామోటార్స్‌ భారీ వాణిజ్య వాహనాల డివిజన్‌ అధిపతి రవీంద్ర పిషరోడి వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేసారు. ప్రస్తుతం చీఫ్‌ ఆప రేటింగ్‌ అధికారిగా సతీష్‌ బోర్వాంకర్‌ బాధ్యతలు తీసుకు న్నారు. పిషరోడి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా 2012 జూన్‌ 21నుంచి పనిచేస్తున్నారు. కంపెనీలోనే 2007లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసారు. కంపెనీ డైరెక్టర్‌గా పనిచేసారు. టాటామోటార్స్‌ అమ్మకాలు పడిపోతుండటం దేశీయ మార్కెట్లలో మందగమనం కూడా పిషరోడీ రాజీనామాకు ఒక కారణంగా చెపుతున్నారు. కంపెనీ వాణిజ్యవాహనాలు మాత్రం 0.45శాతం పెరిగి 3,05,620 యూనిట్లకు చేరాయి మేనెలలో కంపెనీ వాణిజ్యవాహనాల విక్రయాలు దేశీయ మార్కెట్లలో 23,60-6కు చేరాయి. గత ఏడాది మేనెల విక్రయాలకంటే 13శాతం తగ్గాయి. టాటామోటార్స్‌లో చేరక ముందు పిషరోడి క్యాస్ట్రాల్‌ఇండియాలో పనిచేసారు. ఫిలిప్స్‌ఇండియాలో కూడా వివిధస్థాయిల్లో పనిచేసారు.