టయోటా సుజికి టైఅప్‌తో సరికొత్త శకం!

maruti
maruti

ముంబయి: టయోటామోటార్‌ కార్పొరేసన్‌, మారుతిసుజుకి ఇండియా మాతృసంస్థ సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌లు రెండు సంస్థల భాగస్వామ్యంతో ఆటోమొబైల్‌రంగంలో లీడర్‌స్థాయికి ఎదిగేందుకు నిర్ణయించుకున్నాయి. మారుతినుంచి చిన్న కార్ల ఉత్పత్తిని టయోటా నేర్చుకుంటుంటే టయోటానుంచి పెద్దకార్ల ఉత్పత్తిపై మారుతి ప్రయోగాలు ప్రారంభంచనున్నది. మారుతి విటారా బ్రెజ్జా, కరోల్లా, బాలెనో తదితర ఎస్‌యువి తరహా మోడళ్లపై రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుని మార్కెట్‌కు తీసుకురానున్నాయి. మొత్తంగాచూస్తే సుజుకి, టయోటా భాగస్వామ్యం పటిష్టం అయితే మారుతికి భారీ లాభం చేకూరనున్నది. రెండూ ఒక ఒప్పందానికివస్తే ఇక ఉత్పత్తి, అమ్మకాల కసరత్తుల్లోను, కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌పరంగాను, రాయల్టీ చెల్లింపుల్లోను రెండూ సమ ఉజ్జీలుగా చేరతాయి. గడచిన రెండేళ్లుగా సుజుకి, టయోటా సంస్థల మధ్య చర్చలు పతాకస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఈరెండుసంస్థలు ముందు గ్రీన్‌ ఎనర్జీ, భద్రత, సమాచారం టెక్నాలజీ ఉత్పత్తుల పరస్పర సరఫరా, విడిభాగాల పరస్పరసరఫరాపై దృష్టిపెడుతున్నాయి. జపాన్‌లోజరిగిన ఈరెండు కంపెనీల చర్చల్లో ముందు సాంకేతికపరిజ్ఞానం మార్పిడిపైనే చర్చించుకున్నట్లు సమాచారం. భారత్‌లో సుజుకి యూనిట్‌ మారుతిసుజుకి ఇండియా దేశంలోనే అతిపెద్ద చిన్నకార్ల తయారీ సంస్థగా నిలిచింది. ఇక టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ప్రైవేట్‌లిమిటడ్‌ దేశంలో ఆరో ర్యాంకులో ఉంది. ఈ రెండింటిమధ్య సంబంధాలుపెరిగితే మారుతికి మెగా లబ్దిచేకూరుతుందని అంచనా. టయోటా సుజుకి ఉత్పత్తి విధానాలు సరళంగా ఉంటాయి అందువల్లనే ఖర్చుతక్కువతో భారత్‌లో నెట్టుకుని వస్తున్నట్లు వెల్లడించారు. టయోటా ఉత్పత్తి విధానాలు వ్యయభరితంగా ఉంటాయి. ఇప్పటివరకూ కైజెన్‌ విధానంలో అమలవుతోంది. టయోటా సుజుకి ఇప్పటికే పరస్పరసహకారంపై దృష్టిపెట్టాయి. కైజెన్‌ను టయోటా అమలుకు తెచ్చింది. రెండు కంపెనీల ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటివరకూ అనేకసార్లు కలుసుకున్నారు. రెండువైపులానుంచి అత్యుత్తమ విధానాలపై అవగాహన పెంచుకున్నట్లు తేలింది. ఈ రెండు జపాన్‌ కంపెనీలు వారి స్వస్థలాలుసైతం సమీపంలోనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి సంస్కృతి సైతం ఒకేవిధంగా ఉంది. అయితే కొన్ని విభాగాలపరంగా ఈరెండు కంపెనీలు ఏకీభవించడంలేదు. అన్నీ కుదిరితే ఈ రెండు సంస్థలు కవలపిల్లల మాదిరిగాపనిచేస్తాయని అంచనా. జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లో టయోటా సిటీ ఉంది. సుజుకి కార్యకలాపాలకు బేస్‌క్యాంప్‌ మొత్తం హమామత్సునిలిచింది. ఈ రెండు కంపెనీలు ఇపుడు హైబ్రిడ్‌కార్ల ఉత్పత్తివైపు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుదీకరణపరంగా భారత ప్రభుత్వం, స్థానిక కంపెనీలుసైతం వీటితో చర్చలుజరుపుతున్నాయి. ఏది ఏలా ఉన్నా ఈ రెండు కంపెనీలు ఒప్పందానికి వచ్చి భాగస్వామ్యంతో నడిస్తే దేశీయంగాను, ప్రపంచ మార్కెట్లను కొత్త సంస్థ శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.