జెనీవా హెచ్‌ఎస్‌బిసి ఖాతాదారులకు ఐటి నోటీసులు

TAX
TAX

జెనీవా హెచ్‌ఎస్‌బిసి ఖాతాదారులకు ఐటి నోటీసులు

ముంబై, డిసెంబరు 5: జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో రహస్యఖాతాలు కలిగిన ఉన్న భారతీయుల జాబితా బట్టబయలైన రెండేళ్ల తర్వాత ఆ జాబితాలో పేర్లను వారిపై చర్యలు తీసుకోవడానికి ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం నడుం బిగించింది. గత పక్షంరోజుల్లో వారికేసుల విచారణ తేదీలను తెలియజేస్తూ 50మందికి పైగా వ్యక్తులకు నోటీసులు జారీచేసింది. ఈ చర్యతో ఈ ఖాతాదారులు లబ్దిదారుల అపీళ్లను న్యాయస్థానాలు తిరస్కరించిన వెంటనే ఆదాయం పన్నుశాఖ వారిపై ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టడానికి వీలు అవుతుందని ఈ వ్యాపారం గురించి బాగా తెలిసిన వర్గాలు తెలియజేశాయి.

స్విస్‌బ్యాంకులలో రహస్య ఖాతాలకు సంబంధించి పేర్లు లీకైన కొంతమంది వ్యక్తులు దాఖలు చేసిన పిటీషన్లకు వ్యతిరేకంగా నవంబరులో అప్పెలెట్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది చివరి లోగా ఈ వ్యవహారాన్ని అంతా పూర్తిచేయాలని ఆదాయం పన్ను శాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. ట్రస్ట్‌లలో లబ్ది దారులు సదరు ట్రస్టుల నుండి ఎలాంటి సొమ్మును అందుకో నంత కాలం వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని గతం లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, అప్పెలెట్‌ ట్రిబ్యునల్‌ మాత్రం ఆదాయం పన్ను శాఖకు అనుకూలంగా తీర్పు చెప్పింది. స్విట్జార్‌ల్యాండ్‌కు ఆస్ట్రియాలోని చిన్న రాష్ట్రం అయిన లీచెన్‌స్టీన్‌లోని ఎల్‌జిటి బ్యాంకులో రహ స్యం నిధులు దాచిఉంచినట్లు ఆరోపణలు వచ్చిన ఒక ట్రస్టుకు చెందిన కొంత మందిపై ఆదాయం పన్నుశాఖ చర్యలు చేపట్టడంతో వారు ట్రిబ్యునల్‌కు వెళ్లా రు.

అయితే ట్రిబ్యునల్‌ ఐటి శాఖకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అదే ఇప్పుడు ఐటిశాఖకు వరంగా మారింది. అంతకుముందు 2014లో సైతం అప్పెలెట్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన మొదటి తీర్పుకూడా ఆదా యం పన్నుకు అనుకూలంగానే వచ్చింది.

ఈ రెండు తీర్పు లు కూడా స్థానిక చట్టాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చారు. అనుమానాస్పద ట్రస్టుల ద్వారా లబ్దిపొందిన వారు పన్ను నుంచి తప్పించుకోవడం కష్టమని స్థానిక చట్టాలు పేర్కొం టూ ఉండడం ఈ తీర్పులు ఐటి శాఖకు అనుకూలంగా రావటానికి దోహదపడ్డాయి. కాగా ప్రతినెల కనీసం 50కేసులను పరిష్కరించాలని కేంద్ర ప్రత్యక్ష పన్ను ల బోర్డు (సిబిడిటి) ఒక్కో ఐటి అప్పిల్స్‌ కమీష నర్‌ను టార్గెట్‌ నిర్ణయించిందని సీనియర్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దిలీప్‌ లఖాని తెలిపారు. సిఐటి అప్పిళ్ల తర్వాతి అప్పెలెట్‌ ట్రిబ్యునల్‌లో స్టే ఇవ్వనంత వరకు వారి నుంచి పన్ను వసూలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
హెచ్‌ఎస్‌బిసిలకు సంబంధించి కొంత మంది అస్సెస్సీలకు అనుకూలంగా గతంలో అప్పెలెట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిందని అయితే ఇప్పుడు ఈవిషయంలో ఎలా వ్యవహారిస్తుందో వేచిచూడాల్సిఉందని అన్నారు.