జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయం!

jet airways
jet airways

ముంబయి: ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాలను విక్రయించాలని రుణదాతలు నిర్ణయించారు. దాదాపు 75శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనికి బిడ్‌లు దాఖలు చేసే వ్యూహాత్మక వాటాదారులకు కనీసం రూ.1,000 కోట్ల ఆస్తులు ఉండటంతోపాటు మూడేళ్లపాటు విమానయాన రంగంలో అనుభవం ఉండాలని పేర్కన్నారు. దీనికి సంబంధించిన బిడ్‌లను ఏప్రిల్‌ 10లోపు దాఖలు చేయాల్సి ఉంది. 
ఒకప్పుడు ఎయిర్‌ ఇండియాను దాటి దేశంలో నెంబర్‌ వన్‌గా ఎదిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. జనవరిలో మొత్తం 124 విమానాలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 26కు పడిపోయింది. దాదాపు 11ఏళ్లుగా  ఈసంస్థ పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. దీంతో నిర్వహణ బృందం నుంచి నరేశ్‌ గోయల్ తప్పుకొన్నారు.