జియో టారిఫ్‌లు పెరిగాయి

JIO
jIO

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో కొన్ని టారిఫ్‌లను సవరించింది. 84 రోజుల ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు
కంపెనీ తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ టారిఫ్‌ రూ.399గా ఉంది. ఈ టారిఫ్‌ల సవరింపు
గురువారం నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు 1జిబి, 4జిడేటాను
ప్రతిరోజూ పొందవచ్చు. దివాళి ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న
డేటాను 2జిబి నుండి 4.జిబికు పెంచుతున్నామని పేర్కొంది. షార్ట్‌టర్మ్‌ ప్లాన్‌లు, తక్కువ డినామినేషన్‌ రీచార్జ్‌
టారిఫ్‌లను రిలయన్స్‌ జియో తగ్గించింది. వారం వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే
రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌, అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని పేర్కొంది. రోమింగ్‌లో ఉన్నప్పటికీ,
జియో పరిమితిలేని వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోందని చెప్పారు. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది.
అంతేకాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి49 రోజులకు తగ్గించినట్లు కూడా తెలిప