జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ ఛార్జీల తగ్గింపు

AIRTEL
AIRTEL

జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ ఛార్జీల తగ్గింపు

ముంబై, రిలయన్స్‌జియో పోటీని తటు ్టకునేందుకువీలుగా భారతిఎయిర్‌టెల్‌ తాజాగా తన నెట్‌ వర్క్‌లోని కస్టమర్లకు దేశవ్యాప్త రోమింగ్‌పై ఇన్‌కమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లపై ఛార్జిలను తొలగించిం ది. అలాగే ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పైకూడా ఎలాంటి ప్రీమి యంను వసూలుచేయడంలేదని ప్రకటించింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈవిధానం అమలుచేస్తామని వెల్లడిం చింది. అదనపు డేటా ఛార్జీలు కూడా ఉండవని కేవలం హోమ్‌డేటా ప్యాక్స్‌ మాత్రమే కస్టమర్లకు ఛార్జిలుంటా యని ప్రకటించింది ఆర్‌జియో ఏప్రిల్‌ ఒకటవ తేదీనుం చి ఛార్జిలు వసూలు చేస్తామని ప్రకటించిన దరిమిలా ఎ యిర్‌టెల్‌ కూడా తనవంతుగా పోటీని తట్టుకునేందుకు యత్నాలుప్రారంభించింది. ఎండి సిఇఒ గోపాల్‌ విట్టల్‌ మాట్లాడుతూ రోమింగ్‌ తొలగించడంవల్ల దేశం మొత్తం లోకల్‌నెట్‌వర్క్‌ పరిధిలోనికి వస్తుందని వివరించారు. అంతేకాకుండా ఇప్పటికే అందుబాటుధరల్లో ఇంటర్నేష నల్‌ రోమింగ్‌ ప్యాక్‌లు విడుదలచేసింది. ఒకరోజునుంచి పదిరోజులు, 30 రోజుల కాలపరిమితితో ఉన్నాయి. ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌,ఎస్‌ఎంఎస్‌లు వంటి వాటిపై కొన్ని ఉచితం కూడా ప్రకటించింది. కస్టమర్లు విదేశాల్లో ఉన్నా ఇదే ఫోన్‌ వినియోగించుకునే సౌకర్యం ఉంటుం దని, కాల్‌ఛార్జిలు కూడా 90శాతం వరకూ తగ్గించా మని, నిమిషానికి మూడు రూపాయలు ఛార్జిలుగా ఉందని, డేటా ఛార్జీలు కూడా 99 శాతం తగగ్గించి మెగాబైట్‌కు 3 రూపాయలుగా ఉందని వెల్లడించింది.