జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌….?

GST
GST

జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌?

న్యూఢిల్లీ,సెప్టెంబరు 21: పెట్రోల్‌, డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావా లనే డిమాండ్‌ బలంగా వినిపిస్తుంది. కాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగుతుండటంతో ఈ డిమాండ్‌ ముందుకు వస్తుంది. ఎక్జైజ్‌ డ్యూటీ, వ్యాట్‌, డీలర్ల కమీషన్‌ పేరిట వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. సెప్టెంబరు 13న పెట్రోలియం ధరలు భారీగా పెరిగిన సందర్భాన్ని ఉదాహరణగా తీసు కుంటే అదే రోజు ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ కోసం చములు సంస్థలకు డీలర్‌ చెల్లించిన మొత్తం 30.70, కాగా ఎక్సైజ్‌ సంకం పేరిట కేంద్రం 21.48 రూపాయలు వసూలు చేసింది. ఢిల్లీ సర్కారు వ్యాట్‌ పేరిట 14.96 రూపా యలు రాబట్టింది. డీలర్లు 3.24 కమీషన్‌ తీసుకున్నారు. దీంతో ఆ రోజు దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 70.38కి చేరింది.ఇది దేశ వ్యాప్తంగా రోజు జరుగుతున్న విషయమే. లీటర్‌ పెట్రోలు వాస్తవ ధర 30.70 ఉండగా సగటు వినియోగదారుడు అదనపు ఛార్జీల రూపంలో 39.68 చెల్లించాల్సి వచ్చంది. ఢిల్లీ చెల్లిస్తున్న బేస్‌ ధర కంటే ఇది 129.25 శాతం కావడం గమనార్హం.

పెట్రోలియం, ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తే వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీల భారం ఉండదు.28 శాతం జిఎస్‌టి విధించినా పెట్రోల్‌ ధరలు గణనీయంగా తగ్గుతాయి. 39.30 లీటర్‌ పెట్రోల్‌ కొనుగోలు చేయవచ్చు. అంటే లీటర్‌కు 30 రూపాయల పైనే మనకు ఆదా అవుతుంది. ఇలా చేస్తే కామన్‌ మాన్‌కు సంతోషం. కానీ ప్రభుత్వాల ఆదాయానికి భారీగా గండిపడు తుంది. ఢిల్లీ ప్రభుత్వాన్నే తీసుకుంటే పెట్రోల్‌పై 27 శాతం వ్యాట్‌ విధి స్తుంది. అదీగాక ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తం నుంచి 42 శాతం వాటా మళ్లీ రాష్ట్రాల ఖాతాలోకి మళ్లుతుంది.అంటే దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ విక్రయిస్తే 23.98 కేజ్రీవాల్‌ ప్రభుత్వ ఖాతా లోకి వెళ్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ పెట్రోలియం ఉత్పత్తు లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే ఎస్‌జిఎస్‌టి రూపంలో వాటికి దక్కేది 14 శాతమే. అంటే లీటర్‌ పెట్రోల్‌ మీద లభించేంది 4.29 మాత్రమే. చూస్తూ చూస్తూ లీటర్‌ పెట్రోల్‌ మీద 19.69 రూపాయలు వదులుకోవ డానికి ఏ రాష్ట్రానికి కూడా ఇష్టం ఉండదు.

అందుకే పెట్రోలియం ఉత్పత్తుల ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌పై జిఎస్‌టి జిఎస్‌టి కౌన్సిల్‌ గానీ, ఆర్థిక మంత్రిత్వశాఖ గానీ నోరు మెదపడం లేదు. ఒకవేళ జిఎస్‌టి పరిధిలోకి వచ్చి నా ప్రభుత్వాల ఆదాయం భారీగా తగ్గకుండా అద నంగా సెస్‌లు విధించ డానికి కౌన్సిల్‌ మొగ్గు చూపవచ్చు. కాగా జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడమనేది కష్టంతో కూడు కున్నది. కేంద్రమంత్రి జైట్లీ చెప్పినా, మళ్లీ సుంకాలంటూ వినియోగదారులకు మిగిలేది కొంచమే. ఇది పక్కనబెడితే దీపావళి నాటికి ధరలు తగ్గుతాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఇప్పటికైతే ఇది గొప్ప ఊరటగా పేర్కొనవచ్చు.