జిఎస్‌టి అవక‌త‌వ‌క‌ల‌పై నోటీసులు!

GST
GST

న్యూఢిల్లీ: జిఎస్‌టి రిటర్నులు దాఖలులో చూపించిన పన్నులకు వాస్తవంగాచెల్లించిన పన్నులకు వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో జిఎస్‌టి అధికారులు బిజినెస్‌ సంస్థలకు నోటీసులు జారీచేస్తున్నారు. మిస్‌మాచ్‌లు ఎక్కువ కనిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. జిఎస్టఇపరంగా బిజినెస్‌సంస్థలు చెల్లిస్తున్న జిఎస్‌టి 34శాతం తక్కువ ఉందని అంచనా. కంపెనీలు తుదివిడత సేల్స్‌రిటర్నులు జిఎస్టఇఆర్‌ వన్‌ జిఎస్‌టిఆర్‌ 2ఎతో మ్యాచ్‌కాకపోవడంతో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే విక్రేతల రిటర్నులతోపాటు కొనుగోలు రిటర్నులు సరిపోల్చిచూస్తే 34శాతం బిజినెస్‌సంస్థలు కేవలం 34,400 కోట్లు తక్కువ పన్ను చెల్లించినట్లు తేలింది. జిఎస్‌టిఆర్‌ 3బితోనే ఈ మొత్తం రాలేదని జిఎస్‌టి అధికారులు తేల్చారు. 34శాతం బిజినెస్‌ సంస్థలు రూ.8.16 లక్షలకోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. జిఎస్‌టిఆర్‌ 3బి దాఖలుద్వారా పన్ను చెల్లించినట్లుచూపించారు. అయితే జిఎస్‌ఇఆర్‌1 గణాంకాలను విశ్లేషిస్తే వారి పన్ను మొత్తాలు రూ.8.50 లక్షలకోట్లవరకూ ఉన్నాయి. జిఎస్‌టి గుజరాత్‌ కమిషనరేట్‌ జారీచేసిన నోటీస్‌ను చూస్తే పన్ను చెల్లింపుదారులు ఈ అవకతవకలకు సంజాయిషీ ఇవ్వాలని తీవ్రంగాప్రశ్నించింది. జిఎస్‌టిఆర్‌3బి, జిఎస్‌టిఆర్‌1 రిటర్నుల్లో ఉన్న తేడాలు అక్టోబరు డిసెంబరు మధ్యకాలంలో ఉన్నవాటికి వివరణ ఈనెల 14వ తేదీలోపు ఇవ్వాలని నోటీసులుజారీచేసారు. ఈ తేదీలోపు వివరణ అందకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని చట్టప్రకారంచర్యలు ఉంటాయని జిఎస్‌టి అధికారులు చెపుతున్నారు. పన్నులరంగ నిపుణుల అంచనాలప్రకారంచూస్తే జిస్‌టి చట్టం 30రోజుల వ్యవధిని ఇస్తోందని, ప్రస్తుతం ఇచ్చిన నోటీస్‌లో కేవలం పదిరోజులు మాత్రమే ఇచ్చారని చెపుతున్నారు. నోటీసులజారీపై ప్రభుత్వం జిఎస్‌టి అధికారులకు స్పష్టమైనమార్గదర్శకాలు ఇవ్వాలనిసైతం కోరుతున్నారు. ప్రభుత్వం గత ఆర్ధికసంవత్సరంలో రూ.7.41 లక్షలకోట్ల జిఎస్‌టిని వసూలుచేసింది. పన్నుల ఎగవేతను అరికట్టే అన్ని చర్యలను చేపట్టింది. జిఎస్‌టి మండలిపరంగా గణాంకాల తేడాలపై కూడా సీరియస్‌గా చర్చించింది.జిఎస్‌టిఆర్‌1, జిఎస్‌టిఆర్‌ 3బి డేటా అవకతవకలపై తీవ్రంగా చర్చించి ఇందుకు నోటీస్‌లు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. జిఎస్టఇ రిటర్నుల గణాంకాలు ప్రకారంచూస్తే దేశంలో ఇప్పటివరకూ జూలై డిసెంబరు కాలానికి 51.96 లక్షలమంది రిటర్నులు దాఖలుచేసారు. గత ఏడాదిజులై 1వ తేదీనుంచి పన్ను అమలయిన తేదీలనుంచిచచూస్తే 167శాతం మాత్రమే అమ్మకాలరిటర్నులు జిఎస్‌టి తుది రిటర్నులతో సరిపోయినట్లు తేలింది. అంతేకాకుండా 91,072 కోట్ల అదనపు చెల్లింపులుకైడా ఉన్నట్లు వెల్లడించింది. బిజినెస్‌సంస్థలు జిఎస్‌టికింద రూ.6.50 లక్షలు చెల్లింస్తే జిఎస్‌టిఆర్‌వన్‌ రిటర్నుల ప్రకారంచూస్తే వారి పన్ను మొత్తం రూ.5.59 లక్షలుమాత్రమే ఉంది. ఇలాంటి అవకతవకలు తేడాలపై కూడా జిఎస్‌టి అధికారులు సరిచేసేందుకు వ్యాపారసంస్థలకు నోటీసులు జారీచేస్తున్నారు.