జిఎస్టీ ప‌న్ను శ్లాబుల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉందిః జైట్లీ

arun jaitly
arun jaitly

ఫరీదాబాద్‌: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పన్ను శ్లాబులను కుదించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంకేతాలు ఇచ్చారు. ఫరీదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ దేశ ఆదాయం సాధారణ స్థితికి వస్తే.. జీఎస్టీ పన్ను శ్లాబుల కుదింపు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శ్లాబుల కింద వస్తువులపై పన్ను విధిస్తున్నారు.
కొన్ని వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని లేదా పన్ను రేటు తగ్గించాలని, పన్ను చెల్లింపుల భారం ఎక్కువగా ఉందని కొద్ది రోజులుగా రాష్ట్రాల నుంచి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా 28శాతం పన్నుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 30 వస్తువులపై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఖాదీ దుకాణాల్లో అమ్మే ఖాదీ వస్త్రాలకు పన్ను మినహాయించారు.