చిన్నవ్యాపారసంస్థలకు ఐటి క్లౌడ్‌ సేవలు

B2
Kristafer

చిన్న వ్యాపార సంస్థలకు ఐటి క్లౌడ్‌ సేవలు

 

హైదరాబాద్‌, డిసెంబరు 14: దేశంలోని 57 మిలియన్ల ఎస్‌ఎంబిలకు అవసర మైన సాంకేతిక, ఐటిసేవలందించేందుకు జి7సిఆర్‌ స్టార్టప్‌ కంపెనీ అత్యుత్తమసేవలందిస్తుందని సంస్థ ఎండి క్రిస్టఫర్‌ రిచర్డ్‌ వెల్లడించారు. నేడు అత్యాధునిక సేవలు పొందేందుకు చిన్న బిజినెస్‌ సంస్థలకు ఐటి సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంస్థపరంగా క్లౌడ్‌సేవలు అందిస్తుందని దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 75 ఎస్‌ఎంబిలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఒక్క జూలైనెలలోనే క్లౌడ్‌ విభాగానికి 40 దరఖాస్తులుచేశారన్నారు. దేశవ్యాప్తంగా 100మందికిపైగా సేవలందిస్తామని చెప్పారు. దేశంలోని ఐదు కీలక మెట్రోల్లో తమ ఎస్‌ఎంబిసేవలు లభిస్తాయని ఆయన అన్నారు.

వీటిలో ఎపి తెలంగాణల పరంగా సంప్రదింపులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాదినుంచే హైదరాబాద్‌కేంద్రం సేవలు ప్రారంభిస్తుందన్నారు. ఐటిహబ్‌తో పాటుగా పుణె, ముంబై, చెన్నై, కోల్‌కత్తానగరాలకు కూడా విస్తరిస్తా మని అన్నారు. ఇప్పటికే బెంగళూరులో తమ కార్యాలయం ఎస్‌ఎంబి లకు విస్తృతసేవలందిస్తోందన్నారు. గతఏడాది 12కోట్ల రాబడి సాధిం చామన్నారు అతితక్కువ ఛార్జీలతోనే ఎస్‌ఎంబిలకు సేవలు అందుతా యని, 30శాతం కమిషన్‌ రూపంలో తమకు అందుతుందన్నారు. వచ్చేరెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండువేల మంది ఉద్యోగులకు తమ సంస్థల్లో పెరుగుతారని, ఎస్‌ఎంబిలకుఐటి క్లౌడ్‌సేవలందించడంతో తమ సేవలకు గుర్తింపుగా ఇపుడి పుడే మంచి ఆదరణ లభిస్తోందని క్రిస్టఫర్‌ అన్నారు. నెలకు రూ.580 నుంచి గరిష్టంగా రూ.5వేలు మాత్రమే రుసుంవసూలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 75సంస్థలకు సేవలందిస్తున్నామని 1.25 కోట్ల రూపాయల రాబడులు సాధించామన్నారు. దేశంలోని 57 మిలియన్ల చిన్న వర్తక సంస్థల్లో పది శాతం సేవలందించినా తమ సాలుసరి ఆదాయం వందకోట్ల రూపాయలకు చేరుతుందన్న ధీమా క్రిస్ట ఫర్‌ రిచర్డ్‌ వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌పై తమకుఎంతో విశ్వాసంఉందని, ఎస్‌ఎంబి ఐటిసేవలకుగాను తాము మైక్రోసాప్ట్‌, అమెజాన్‌లతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.