చమురు ధరల్లో భారీ పతనం

oil
oil

చమురు ధరల్లో భారీ పతనం

వైమానికరంగ కంపెనీల షేర్ల ర్యాలీ
ఐదునెలల కనిష్టానికి ముడిచమురు ధరలు

ముంబయి, మే 6: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి భారీగా పతనం అయ్యాయి. గత ఏడాది నవంబర్‌ నెలలో నమోదయిన కనిష్టస్థాయికి చేరాయి.బ్రెంట్‌ ముడిచమురు, డబ్య్లుటిఐ ఫ్యూచర్లు కూడా 17శాతం దిగ జారాయి. గురువారం లండన్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ఒక్కింటికి ఐదుశాతం పతనం యి 48.26 డాలర్లకు చేరింది. ఐదునెలలకుపైబడిన కనిష్టధరలుగా నిపుణు ల అంచనా. ఇక న్యూయార్క్‌ మార్కెట్‌లో నైమెక్స్‌్‌బ్యారెల్‌ సైతం ఐదుశాతం పడిపోయి 45.52 డాలర్లకు చేరింది. మార్చి 8 తర్వాత ఈ స్థాయిలో ధరలు పడిపోవడం మళ్లీ ఇప్పుడే ఒపెక్‌ దేశాల ఒప్పందంలో లేని లిబియా ఉత్పత్తిని పెంచుతుం డటానికి తోడు అమెరికాలో ఇంధననిల్వలు పుంజుకునన వార్త లు ప్రధానంగా చమురుధరలను పడగొట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

గతఏడాది నవంబరులో ధరలకు నిలకడ తీసుకు వచ్చేందుకు వీలుగా ఒపెక్‌ నాన్‌ ఒపెక్‌ దేశాలమధ్య ఒప్పందం కుదిరాక చమురుధరలు బలపడతూ వచ్చాయి. రోజుకు 1.8 మిలియన్‌ బ్యారెళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పొడిగింపుపై మరోసారి సందేహాలు తలెత్తగా మలేసియా తదితర పలుదేశాల్లో చమురునిల్వలు పేరుకుపోతుండటం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచినట్లు నిపుణులు చెపుతున్నారు. ఇక తాజా సమాచారంచూస్తే లండన్‌ మార్కెట్‌ల బ్రెంట్‌ ముడిచమురు 7శాతం దిగజారి బ్యారెల్‌ ఒక్కింటికి 47 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్‌లో నైమెక్స్‌ బ్యారెల్‌ మరింత అధికంగా మూడుశాతం కంటే ఎక్కువ పతనం అయింది. 44.18 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూర్చే వీలుంది.

దిగుమతుల బిల్లులో భారీ మొత్తం చమురుచెల్లింపు లకే సరిపోతున్న అంశం తెలిసిందే. దేశీయంగా పెట్రో ఉత్ప త్తుల ధరలను సైతం తగ్గించే అవకాశం ఉంది. పెట్రోలు డీజిల్‌ కస్టమర్లకు లబ్ధిచేకూరనున్నది. అయితే ఆయిల్‌పై ఆధారపడే చమురుదేశాల ఆర్థిక వ్యవస్థలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వెరసి ఈ దేశాలు భారత్‌ వంటి వర్ధమాన దేశాలలో పెట్టుబ డులకు వెనకడుగు వేసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఇప్పటికీ దేశ ఇంధన అవసరాల్లో 80శాతం వరకూ దిగుమతుల పైనే ఆధారపడుతున్న అంశం విదితమే. అలాగే పెట్రోలు పంపులవద్ద కూడా క్యూ లు పెరిగే అవకాశం ఉంది.

ముడిచమురు ధరలు పతనంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు చమురుధరలను ప్రతిరోజూ సమీక్షిస్తున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం మరింతగా ధరలుపతనం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చమురు ధరల పతనంతో విమానయానరంగ కంపె నీల షేర్లకు రెక్కలు విచ్చుకున్నాయి. బిఎస్‌ఇలో స్పైస్‌జెట్‌ 6.3శాతం దూసు కెళ్లింది. రూ.120వద్ద కొనుగోళ్లు ఉన్నా యి. ఒకదశలో 122వరకు పెరిగింది. ఏడాది కాలంలో స్పైస్‌ జెట్‌ 113శాతం దూసుకెళ్లింది. డిసెంబరు 30వతేదీ నమో దని రూ.57స్థాయి నుంచి తాజాగా రూ.120ని చేరింది. ఇదే బాటలో జెట్‌ఎయిర్‌వేస్‌ నాలుగుశాతం జంప్‌చేసి రూ.544వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇంట్రాడేలో రూ.552కు సైతం చేరుకుంది. ఇక ఇంటర్‌గ్లోబ్‌ ఏవి యేషన్‌ ప్రస్తుతం 2.4శాతం బలపడి రూ.1135వద్ద ట్రేడింగ్‌ జరుగుతోంది. ఇంట్రాడేలో రూ.1152వరకూ ఎగిసింది. వీటికితోడు రూపాయి అండ కూడా పెరి గింది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు నిర్వహణ వ్యయంలో జెట్‌ ఇంధనమే సింహభాగం ఆక్రమిస్తుంది. 65శాతంవాటా ఉంటుంది. చమురుధరలు అంతర్జాతీయ మార్కెట్లలో దిగజారితే విమాన కంపెనీల షేర్లు పెరు గుతుంటాయి. వీటికితోడు డాలరుతో రూపాయి మారకం విలువలు కొంత మద్దతునిస్తాయి. రూపాయి బలపడితే ఎటిఎఫ్‌ మరింత చౌక అవుతుంది. తాజా గా విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల పతనం రెండురోజుల్లోనే భారీ పతనం చవిచూసింది. విమాన ప్రయాణీ కుల సంఖ్య రెండంకెల స్థాయిలో వృద్ధి, ముడిచమురుధరల పతనం వంటి అంశా లు ఈ కంపెనీలకు ఊతం ఇస్తున్నాయి. స్సైస్‌జెట్‌ రికవరీ అయితే జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగోలాభాలు ఊపందుకున్నాయి