గ్లోబల్‌ సర్వర్లలో డేటా తొలగింపునకు గడువు చెప్పండి

master card
master card

ఆర్‌బిఐకి మాస్టర్‌కార్డు లేఖలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్డుచెల్లింపులసంస్థ మాస్టర్‌కార్డ్‌ భారతీయ కార్డుదారుల డేటాను తమ గ్లోబల్‌సర్వర్లనుంచి తొలగిస్తామని రిజర్వుబ్యాంకుకు స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి ఒక తేదీని నిర్ణయించాలని కోరింది. లేనిపక్షంలో కార్డుదారుల భద్రతకు ముప్పువాటిల్లడంతోపాటు వాటి రక్షణ కూడా కష్టం అవుతుందని వెల్లడించింది. భారతీయ విభాగం అధ్యక్షుడు పోరుష్‌ సింగ్‌ మాట్లాడుతూ కంపెనీ మొత్తం 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇపుడు అన్ని సర్వర్లనుంచి భారతీయ కార్డుదారుల డేటాను తొలగించాలని ఆదేశించిందని వెల్లడించారు.గతనెల 16వ తేదీనుంచి ఆర్బఇఐ కొత్త నిబందనలను మార్గదర్శకాలను జారీచేసింది. పేమెంట్స్‌ కంపెనీలు మొత్తం సమాచారాన్ని వాటి లావాదేవీలకు సంబంధించి దేశంలోని కంప్యూటర్లలో మాత్రమే నిక్షిప్తంచేయాలని సూచించింది. మాస్టర్‌కార్డ్‌ తమ భారతీయ లావాదేవీల డేటా మొత్తం పూణెలోని టెక్నాలజి కేంద్రంలో భద్రపరిచామని అక్టోబరు ఆరవ తేదీవరకూ ఈ డేటా ఉందని ఆర్‌బిఐ నిర్ణయించిన స్థానికీకకరణ నిబంధనలను అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా లావాదేవీలపై వచ్చిన వివాదాలు, ఇతర డేటా భద్రతపై కూడా ఇక ముప్పు ఏర్పడుతుంందని, గ్లోబల్‌ సర్వర్లనుంచి తొలగించేందుకు తేదీలు నిర్ణయిస్తే ఆప్రకారం తొలగిస్తామని వెల్లడించారు. ప్రతిచోటా ఉనన డేటాను తొలగిస్తామని, అది కార్డునెంబరు అయినా, లావాదేవీల వివరాలయినా మొత్తం తొలగిస్తామని అన్నారు. డేటా కేవలం భారత్‌లో మాత్రమే నిక్షిప్తంచేస్తామని వెల్లడించారు. గ్లోబల్‌సర్వర్లనుంచి తొలగించడం ప్రారంభిస్తామని వెల్లడించారు. మాస్టర్‌కార్డు ఆర్‌బిఐకు మరో ప్రతిపాదన చేస్తూ భారతీయ లావాదేవీల డేటాను స్థానికంగానే నిల్వచేస్తామని, వెల్లడించింది. డేటాను స్థానికంగా నిల్వచేయాలంటే స్థానికంగానే ముందు కేంద్రాల ఏర్పాటు అనివార్యం అవుతుందని, డేటాను ముందు సేకరించి, ప్రాసెస్‌చేసి దేశంలో నిక్షిప్తంచేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయంగా లావాదేవీలు నిర్వహిస్తే ఆప్రకారం డేటా బదిలీ అవుతుందని వాదిస్తోంది. అయితే ఎప్పుడైతే ఎన్‌పిసిఐ యుపిఐ లావాదేవీలు ప్రత్యేక రూపేకార్డులనుప్రవేశపెట్టిందో ఈ గ్లోబల్‌ సంస్థలకు మనుగడ కష్టం అవుతుందని గ్రహించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బిఐకి ఫిర్యాదులుచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు స్థానికంగా డేటానిక్షిప్తంచేయడం వల్ల అదనపు భారం పెరుగుతుందన ఇవాదిస్తున్నాయి. అయినప్పటికీ తాము ఇప్పటికే భారత్‌లోని కేంద్రాల్లోనే భారతీయ లావాదేవీలను నిక్షిప్తంచేస్తున్నట్లు మాస్టర్‌కార్డ్‌ వెల్లడించింది. అయితే గ్లోబల్‌ సర్వర్లనుంచి డేటాను తొలగించేందుకు ఆర్‌బిఐ నిర్దిష్టమైన గడువు ఇస్తూ తేదీలు ప్రకటించాలనిమాస్టర్‌కార్డ్‌ ప్రకటించింది.