గ్లోబల్‌ విలీనాలు, కొనుగోళ్లు 3.1లక్షల కోట్ల డాలర్లు

B4
Dollars

గ్లోబల్‌ విలీనాలు, కొనుగోళ్లు 3.1లక్షల కోట్ల డాలర్లు

 

న్యూఢిల్లీ, డిసెంబరు 29: అంతర్జాతీయంగా వివిధ సంస్థల్లో కొనుగోళ్లు, విలీనాలు మొత్తం 3.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2007వ సంవత్స రం తర్వాత మూడోసారి భారీ ఎత్తున ఈ లావా దేవీలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది కంటే 22 శాతం ఈ లావాదేవీలుపెరిగాయి. మెర్జర్‌ మార్కెట్‌ గ్లోబల్‌ సంస్థ అంచనాలను చూస్తే రాజకీయంగా నెలకొన్న అనూహ్యపరిణామాలు అంతర్జాతీయంగా విలీనం కొనుగోళ్ల కార్యకలాపాలను పెంచాయి. మొత్తం 16,194 డీల్స్‌ జరిగితే వాటి విలువ 3.1 లక్షలకోట్లు డాలర్లుగా ఉంది. ఒక్క 2007 సంవ త్సరంలో మాత్రమే 3.7 లక్షల కోట్ల డాలర్ల విలు వైన విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. కార్పొరేట్‌ రంగచరిత్రలో ఇదే అత్యంత భారీ కొనుగోళ్లుగా ఆర్థికనిపుణులు చెపుతారు. అక్టోబరునెలలో ఈ కొనుగోళ్లు విలీనాల విలువ 454.3 బిలియన్‌ డాల ర్లుగా ఉంది. మొత్తం 1362 డీల్స్‌జరిగాయి. నెలవారీగాచూస్తే 2007 మేనెల తర్వాత ఇదే అత్యంత ఎక్కువమొత్తం జరిగిన లావాదేవీలుగా నిలుస్తాయి. 2007 మేనెలలో 546.7 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. 2016 సంవత్సరంలో 38కి పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ ఒక్కొక్కటి పదిబిలియన్‌ డాలర్లకుపైబడి ఉంటుం ది. మొత్తంగాచూస్తే వీటి లావాదేవీల విలువ 911.5 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. అలాగే మొత్తంగా గత ఏడాది ఈ తరహా పెద్ద డీల్స్‌ 57 వరకూ జరిగాయి. మొత్తం 1.5 లక్షలకోట్ల డాలర్లు గా ఉన్నాయి. అయితే రానున్న ఆర్థిక సంవత్సరం మాత్రం అనిశ్చితితో ఉంటుందని మెర్జర్‌ మార్కెట్‌ అంచనా వేసింది. బ్రెగ్జిట్‌ సంప్రదింపులు ప్రారం భం కావడం, అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ బాధ్య తలు స్వీకరించడం, ఫ్రెంచ్‌, జర్మనీ ఎన్నికలు వంటి వి కొంత ఈ మార్కెట్‌కు అనిశ్చితిని పెంచుతాయని చెప్పవచ్చు. వివిధ రంగాలపరంగా విద్యుత్‌, యుట ిలిటీ, మైనింగ్‌రంగాల్లో 582.8 బిలియన్‌ డాలర్లు విలువైన కొనుగోళ్లు విలీనాలు జరిగాయి. మొత్తం 1351 డీల్స్‌ జరిగాయి. తదనంతరం పారిశ్రామిక రసాయనాలు 3056 డీల్స్‌తో 498.5 బిలియన్‌ డాలర్లు మొత్తం జరిగింది. టెక్నాలజీరంగపరంగా 2115 డీల్స్‌లో మొత్తం 401.4 బిలియన్‌ డాలర్లు చేతులుమారాయి. చైనా డీల్‌ మేకర్లు 242 డీల్స్‌ లో పాల్గొన్నారు. మొత్తం 171 బిలియన్‌ డాలర్లు ఆసియా బయటి ప్రాంతంలో కొనుగోళ్లు జరిపారు. అంతకుముందు సంవత్సరం రికార్డు విలువలతో పోలిస్తే 3.5 రెట్లు ఎక్కువే. ఏడాది చివరిలో అమెరికాపరంగాచూస్తే భారీ డీల్స్‌ జరిగాయి. ఎటిఅండ్‌టి, టైమ్‌వార్నర్‌, లెవెల్‌3/సెంచురి లింక్‌, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌/సునుకో వంటి కంపెనీలు భారీ విలువలతో డీల్స్‌ నడిపాయనే చెప్పాలి.