గ్రేట్ ఇండియన్ సేల్ అమెజాన్

AMAZON2

ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ‘గ్రేట్ ఇండియన్ సేల్’ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుండి 23వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సేల్ లో భాగంగా వినియోగదారులు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ సభ్యులు అయితే వారికి 12 గంటల ముందుగానే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలతో పాటు అనేక ప్రోడక్ట్ లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. కాగా, బజాజ్ ఫిన్‌ సర్వ్‌ తో నో కాస్ట్ ఈఎంఐ, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఉంది.