క్రికెట్‌ సీజన్‌లో భారీస్క్రీన్‌ టివిలకు ఇఎంఐలు

TECHNOKA
టెక్నోకార్ట్‌ ఇండియా సిఇఒ సంజయ్ కర్వా
ముంబై : దేశంలో క్రికెట్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డిజివరల్డ్‌ తాజాగా సులభ ఇఎంఐ విధానంలోనే ఎల్‌ఇడి టివిని సొంతం చేసుకునే ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఇండి యన్‌ పవర్‌ బ్రాండ్‌ 2016 పుర స్కారం పొందిన డిజివరల్డ్‌ భారీ స్క్రీన్‌ ఉన్న టివిలను సైతం అందుబాటు లోనికి తెచ్చింది. డిజివరల్డ్‌ను ప్రారం భించిన టెక్నోకార్ట్‌ ఇండియా సిఇఒ సంజయ్ కర్వా మాట్లాడుతూ నగరం లోని కస్టమర్లు అందరికీ పెద్దస్క్రీన్‌ ఉన్నఎల్‌ఇడి టివిలను అందుబాటులోనికి తెచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా టివిలతోపాటే డిజి వరల్డ్‌స్టోర్‌ హైదరాబాద్‌లో మరింత విస్తరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు కర్వా వెల్లడించారు అన్ని గృహో పకరణాలను ఒకే వేదికపై కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. డి2హెచ్‌ సేవలునుంచి రీఛార్జ్‌ ఎంపికవరకూ అన్నీ లభిస్తాయని సంజ§్‌ు విలేకరులకు తెలిపారు బిగ్‌మ్యాచ్‌ బిగ్‌ పిక్చర్‌, బిగ్‌ సేవింగ్స్‌ నినాదంతో ఈ ఆఫర్‌ను వచ్చేనెల 30వ తేదీవరకూ అందుబాటులో ఉంచామన్నారు. వీడియోకాన్‌, సాన్‌సుయి, ఫిలిప్స్‌, హుండై బ్రాండ్ల ఉత్పత్తులు డిజివరల్డ్‌లో లభిస్తాయన్నారు.