కొలిక్కి వచ్చిన టాటా-డొకొమో వివాదం

tata docomo
tata docomo

కొలిక్కి వచ్చిన టాటా-డొకొమో వివాదం

 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: టాటాసన్స్‌ మంగళవారం ఎన్‌టిటిఆ డొకొమోతో ఒక పరిష్కారానికి వస్తు న్నట్లు ప్రకటించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదానికి సంబంధించి జపాన్‌ కంపెనీ షేర్ల బైబాక్‌ వివాదంకొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యవర్తిత్వకోర్టు వెంటనే 1.7 బిలి యన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టులో ధరావత్తుచేయాలని ఎస్క్రోఖాతాలో ఉంచాలని జారీ అయిన ఉత్తర్వులకు సంబంధించి యాజమాన్యం మారిన తర్వాత టాటా టెలీ సర్వీసెస్‌ ఈ వివాదాన్నిముగించాలని నిర్ణయిం చింది. భారత్‌లో సహేతుకమైన పెట్టుబడుల వాతా వరణం ఉంటుందన్న విశ్వాసం పెంపొందించే దిశగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టిటి డొకొమోతో సంయుక్తంగా లండన్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని సంప్రదించాలని నిర్ణయించాయి.

జూన్‌ 22వ తేదీ ఇందుకు సంబంధించి న్యాయస్థానం ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కాంట్రాక్టు ఒప్పందాల ప్రకారం భారత్‌లోను బయట దేశాల్లో కూడా మంచి ప్రతిష్టకలిగి ఉన్నందున టాటాసన్స్‌బోర్డు తన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. జపాన్‌తో మంచి వాణిజ్యసంబం ధాలున్నాయని, ఆర్ధికపరమైన ఈ వివాదాన్ని సత్వరమే ముగించాలని ఆర్‌బిఐ కూడా ఆర్ధికశాఖ ను కోరింది. ప్రస్తుత చట్టాలు ప్రకారం వాటాలను ముందుగా విలువలు కట్టేందుకు వీలులేదని ఆర్ధిక మంత్రిత్వశాఖ తన నిబంధనలను మార్చిన పక్షంలో ఈ షేర్లకు ముందుగానే విలువలు కట్టి ఆప్రకారం పరిష్‌కరించుకునే అవకాశం ఉందని భావిస్తోంది. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో రెండు పార్టీలు సంయుక్తంగా దరఖాస్తులుచేసాయి. పరి ష్కారానికి సంబంధించిన నియమనిబంధనల విషయమై ఈ దరఖాస్తులుచేసాయి. ఢిల్లీ హైకోర్టు ఆమోదించిన పక్షంలో 1.18 బిలియన్‌ డాలర్లు ఇప్పటికే డిపాజిట్‌ చేసి ఉన్నందున డొకొమో 26.5 శాతం షేర్లను టాటా టెలి సర్వీసెస్‌కు బదిలీచేసేందుకు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఢిల్లీ కోర్టుకు విన్నవించాయి. వచ్చేనెల 8వ తేదీ ఇందుకు సంబంధించి రిజర్వుబ్యాంకునుంచి మార్గ దర్శకాలు కూడా ఢిల్లీ హైకోర్టుకు నివేదిం చాల్సి ఉంటుంది.

ఈ వివాదం ఢిల్లీ హైకోర్టు స్థాయిలో ముగిసిన వెంటనే డొకొమో కూడా తన కార్యనిర్వాహక ఉత్తర్వులు అమలు చేయాలన్న పిటిషన్‌ను బ్రిటన్‌, అమెరికాల్లో దాఖలుచేసిన వాటిని ఉపసంహరించుకునేదిశగా అంగీకారం కుదించింది. టాటాసన్స్‌,డొకొమో రెండు సంస్థలు కూడా ఒక వివేకవంతమైన ఒప్పందం దిశగా పరి ష్కరించుకునేందుకు అవకాశాలుమెండుగా ఉన్నా యని న్యాయనిపుణులుసైతం చెపుతున్నారు.