కొనుగోళ్ల మోత‌తో భారీ లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

stock markets ends with profits
stock markets ends with profits

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్ట‌ర్ల పెట్టుబడులు మార్కెట్ కలిసి రావ‌డంతో వరుసగా రెండో రోజు స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. ఈ క్ర‌మంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడి మళ్లీ 33వేల మైలురాయిని దాటగా నిఫ్టీ 10,200 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. ఈ ఉదయం 150 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 301 పాయింట్లు లాభపడి 33,250 వద్ద స్థిరపడ‌గా అటు నిఫ్టీ కూడా 99 పాయింట్లు ఎగబాకి 10,266 వద్ద ముగిసింది.