కొత్త సంవ‌త్స‌రంలో 10 శాతం జీతాల పెంపు?

curency
curency

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగుల వేత నాలు 2018లో దాదాపు 10శాతం పెరగవచ్చని విల్స్‌ టవర్స్‌ వాట్సన్‌ అనే సంస్థ విడుదలచేసిన వేతనాల బడ్జెట్‌ ప్రణాళిక నివేదికలో పేర్కొంది. 2017లో సైతం వేతనాలు ఇదేస్థాయిలో పెరిగా యి. కాగా గతకొన్ని సంవత్సరాలుగా దేశంలో ఏడాదికేడాది వేతనాల పెరుగుదల తగ్గిపోతున్న నేపథ్యంలో 2011తర్వాత మొట్టమొదటిసారి గా 2018 లో వేతనాల పెరుగుదల సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావచ్చని కూడా ఆ నివేదిక పేర్కొంది. వివిధ రంగాలలో ఉద్యోగాల గ్రేడ్ల ఆధారంగా ఈ నివేదికను రూపొం దించారు. ఈ నివేదిక ఆధారంగానే కంపెనీ లు తమ వార్షిక వేతనాల పెరుగుదల ఎంత ఉండవచ్చో ఒక అంచనాకు వస్తాయి. ఏడాదికేడాది భారత్‌లో వేతనాల పెరుగుదల తగ్గుతున్నప్పటికీ 2018వ సంవత్సరంలో వేతనాల పెరుగుదల అంచనా ఆసియా పసిపిక్‌ ప్రాంతంలోనే ఎక్కువ కావడం గమనార్హం. ఇండోనేషియాలో 8.5శాతం, చైనాలో 7శాతం, ఫిలిప్పిన్స్‌లో 6శాతం, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌లలో 4శాతం చొప్పున వేతనాలు పెరగవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఆసియా, పసిపిక్‌ ప్రాం తంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ లోనే ఇప్పటికి వేతనాల పెరుగుదల ఎక్కువ గా ఉందని ఈ సంస్ధకు చెందిన ఆసియా పసిపిక్‌ ప్రాంత డేటా సర్వీసుల విభాగం చీఫ్‌ సంభవ్‌ రక్యాన్‌ చెప్పారు. అయితే ఏడాదికేడాది వేతనాల పెరుగుదల తగ్గుతున్న నేపథ్యంలో 2011తర్వాత మొట్టమొదటి సారిగా 2018లో ఉద్యోగుల వేతనాల పెరుగుదల సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావచ్చని ఆయన అన్నారు. ఉద్యోగాలలో శరవేగంగా వస్తున్న మార్పులు, నైపు ణ్యం, ఉద్యోగ భవిష్యత్తు ముఖ్యంగా టెక్నాలజీ ఉద్యోగాలను ఎక్కువగా కోరుకునే యువత నేపథ్యంలో కంపెనీలు సైతం వారి టాలెంట్‌ను ఆకర్షించే విషయంలోనూ పునరాలోచన పడనున్నా యని, కేవలం జీతాలు పెంచడమే దీనికి పరిష్కా రం కాదనే విషయాన్ని గ్రహిస్తున్నాయని కూడా ఆయన అన్నారు. 2017లో అత్యున్నత పనితీరును కనపరచే వారికి జీతాల పెరుగుదల 39శాతం దాకా ఉంది. అంతకుముందు ఏడాది అది 38శాతం మాత్రమే ఉంది. అయితే మరోవైపు సగటు పని తీరును కనపరచే వారికోసం కంపెనీలు కేటాయించే బడ్జెట్లు ఇంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గి 27శాతంగానే ఉన్నాయి. అయితే ఈ మార్పులు చాలా స్వల్పమేనని, అయితే వేతనాల బడ్జెట్లను మాత్రం కంపెనీలు తగ్గించుకుంటున్నా యన్న మాట మాత్రం వాస్తవమని విల్స్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా డైరెక్టర్‌ అరవింద్‌ ఉశ్రేత§్‌ు అన్నారు. అయితే ఇప్పుటికి దేశంలో బాగా పనిచేసేవారికే తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలనే యాజమాన్యాల సెంటిమెంట్లను ఈ వేతనాల బడ్జెట్లో ప్రతిబింబిస్తున్నాయని ఆయన చెప్పారు. పనితీరుకు, వేతనాలకు ముడిపెట్టే విషయంలో కంపెనీలు చాలావరకు పరిపాలన, ఉద్యోగుల శిక్షణ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వ నున్నాయని ఆయన అన్నారు. కాగా ఎగ్జిక్యూ టివ్‌ల వేతనాలలో కొంత తగ్గుదల ధోరణి కనిపి స్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ రంగంలో మాత్రం వేతనాల పెరుగుదల పనితీరును బట్టి 2-3శాతం నుంచి పైస్థాయిలో 15శాతం దాకా ఉంటోందని నివేదిక వెల్లడించింది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగుల వేతనాల పెరుగుదల 10 శాతం దాకా ఉన్నప్పటికీ భారీ తేడాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. కాగా నివేదిక సర్వే జరిపిన వివిధ రంగాల పరిశ్రమల్లో విద్యుత్‌, ఎఫ్‌ఎంసిజి, రిటైల్‌ రంగాల్లో చెప్పుకోదగ్గ వేతనాల పెరుగుదల ఉంది. ఈ రంగాల్లో వేతనాల పెరుగుదల 10.5శాతం దాకా ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో సంస్కరణలు, అలాగే రిటైల్‌ రంగంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రంగాల సమన్వేయం లాంటివి ఈ వేతనాల పెరుగుదలకు అద్దం పడుతున్నాయి. కాగా ఫార్మాస్యూటికల్‌ రంగంలో వేతనాల విషయంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. 2017వ సంవత్సరంలో ఈ రంగంలో జీతాల పెరుగుదల 11శాతం దాకా ఉండగా, 2018లో అది 10.3శాతం మాత్రమే ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. అలాగే ఫెనాన్షియల్‌ సేవల రంగంలో కూడా వేతనాల పెరుగుదల మొత్తం పెరుగుదల అంచనా కన్నా తక్కువగా 9.1శాతమే ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. ఏదిఏమైనప్పటికీ స్టార్టప్‌ కంపెనీలు చిన్న బహుళజాతి సంస్థలు లాంటివి కీలకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ఆకర్షించడానికి వారు చేయిజారిపోకుండా ఉండడానికి సగటు పెరుగుదల కన్నా ఎక్కువగానే వేతనాలను ఆఫర్‌ చేయవచ్చని కూడా రక్యాన్‌ తెలిపారు.