కొత్త ఐఫోన్ మొద‌ట భార‌త్‌లోనే విడుద‌ల?

IPHONE
IPHONE

ఢిల్లీ: ఆపిల్ సంస్థ త‌న కొత్త ఐఫోన్‌ను మొట్టమొదటిసారి భార‌త్ లో విడుదల చేసేందుకు సిద్ద‌మ‌వుతుంది. వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఐఫోన్ ఎస్ఈ2ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 2 స్టోరేజ్‌ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ ఎస్ఈ2 ఫీచర్స్: ర్యామ్‌, 1700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 12 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ సెకండరీ కెమెరా, 2జీబీ, 4 అంగుళాల ప్యానెల్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్న‌ట్లు స‌మాచారం.