కొత్త ఏడాదిలోనూ ఈక్విటీకి తప్పని అనిశ్చితి!

EQUITY--
EQUITY-

కొత్త ఏడాదిలోనూ ఈక్విటీకి తప్పని అనిశ్చితి!

ముంబయి, మార్చి 31: స్టాక్‌ మార్కెట్లకు రానున్న ఆర్ధికసంవత్సరం కష్ట కాలం అనేచెప్పాలి. ఈ ఏడాది కొంతమేర అనిశ్చితి కొనసాగుతుం దని అంచ నా. ఫిబ్రవరినుంచి మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ఈక్విటీ నిపుణులు అంచనా లేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం వరకూ చూస్తే పటిష్టమని దేశీయనగదు లభ్యత, స్థూల ఆర్థిక గణాంకాలు కొంత ప్రోత్సాహకరంగా కనిపించాయి. జనవరి వరకూ మార్కెట్లు సజావుగానే కొనసాగాయి. ఫిబ్రవరినుంచి సమస్యలు తలెత్తాయి.

జనవరి వరకూ మార్కెట్లలో ఏకైక సర్దుబాటు ఐదుశాతానికి మంఇచి జరగలేదు. ప్రపంచ మార్కెట్లలో బాండ్ల రాబడులు పెరగడం ఒక ప్రధాన కారణం. ఇటీ వలి అనిశ్చితికి ఇదే పెద్దకారణం అయింది. ఫిబ్రవరిలో నాలుగేళ్ల గరిష్టానికి పదేళ్ల ప్రభుత్వ సెక్యరిటీల రాబడులుపెరిగాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుం దన్న అంచనాలు ఒకపక్క, మరోపక్క అమెరికా ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాలు మరోపక్క రాబడులను దెబ్బతీసాయి. వీటికితోడు ఆర్థికలోటు పెరగడం కూడా కొంత కలవరపరిచింది. వీటిదృష్ట్యానే రిజర్వు బ్యాంకు తన పాలసీ రేట్లపరంగా తటస్థవైఖరిని ప్రకటించింది.

వీటికితోడు బ్యాంకింగ్‌రంగంలో పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కుంభకోణాలు భారీగా దెబ్బ తీసాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల వాటాలు భారీగా క్షీణించాయి. అలాగే కొంతకాలం క్రితం నిలిపివేసిన దీర్ఘకాలిక మూలధన లబ్దిపై పన్నును మళ్లీ ప్రవేశపెట్టడం కూడా స్టాక్‌ నష్టాలకు కారణం అయింది. ఇక ఫండ్‌ ఇన్వెస్టర్లకు ఈ సెంటిమెంట్‌ బలంగా దెబ్బతీసిందనే చెప్పాలి. భారత్‌ ఈక్విటీ మార్కెట్లు ఫిబ్రవరి నెలలో 5శాతం సవరణ జరిగితే మార్చినెలలో 3.5శాతం సవరణలు జరిగాయి.

మొదటి పదినెలల్లో లాభాలు పెరిగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 11.3శాతం, 50షేర్‌ నిఫ్టీ 10.2శాతం చొప్పున పెరిగాయి. మొదటి రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన రాబడులు డిసెంబరులో కొంత పెరిగింది. ఆర్థికరికవరీ కొంత ప్రగతిపథంలో ఉందని, కారొఏట్‌ రాబడులను రెండంకెల స్థాయికి 2019 సంవత్సరంలోనే తీసుకెళుతుందని అంచనావేసింది. ఇక డచ్‌బ్యాంక్‌ అంచనాలప్రకారంచూస్తే 2014 మధ్యస్తంనుంచి భారత్‌ మార్కెట్లు వివిధ రంగాల్లో వచ్చిన ధోరణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఆధారపడి నడి చాయి. ఈక్విటీ మార్కెట్లపనితీరు, కార్పొరేట్‌ రాబడుల వృద్ధి ఆధారంగా నడి చాయి.

ముడిచమురుధరలుపెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, బాండ్ల మార్కెట్‌లో అమ్మకాలు వంటివి దేశీయంగా నీరవ్‌మోడీ కుంభకోణం వంటివి కొంత దెబ్బతీసాయనే చెప్పాలని, డచ్‌బ్యాంకు భారత్‌ విభాగాధిపతి అభ§్‌ు లైజావాలా వెల్లడించారు. బ్యాంకుల్లో రుణాలవృద్ధి 11శాతానికిపెరిగింది. వాణిజ్యవాహనాల విక్రయాలుసైతం 25శాతం చొప్పున పెరిగాయి. ఉక్కురంగ సామర్ధ్య వినియోగం 84శాతానికి పెరిగింది. దీనివల్ల ఉక్కుధరలు తొమ్మిదేళ్ల గరిష్టానికి పెరిగాయి.

అయినప్పటికీ రానున్న ఆర్థికసంవత్సరంలో మరికొన్ని సవాళ్లు తప్పవని అంచనావేసారు. వచ్చే ఏడాది అధికార పార్టీయే అధికారం లోకి వస్తుందని చెప్పలేం, ప్రపంచముడిచమురుధరలు క్రమేపీ పెరుగుతున్నా యి. అమెరికా ఫెడ్‌రిజర్వు రేట్లు భారీగా పెరుగుతాయని అంచనా. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల సమస్య ఒకటి ఉండనే ఉంది. ఈ అన్ని కారణాలతో మార్కెట్లకు అనిశ్చితి మరికొంత కొనసాగుతుందని మోతీ లాల్‌ ఓస్వాల్‌ ఆర్థికసేవల సంస్థ ఎండి రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇక నోమురా రేటింగ్స్‌సంస్థ అయితే ఎక్కువ అమెరికా వడ్డీరేట్లు, డాలర్‌ పెరుగుదల, గ్రూప్‌3 సెంట్రల్‌ బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టీల తగ్గుదల వంటివి నిధులు విత్‌డ్రాకు దారితీస్తాయని అంచనావేసింది. వడ్డీరేట్లు దేశీయం గా రూపాయి తగ్గుదలకు దారితీస్తుందని అంచనావేసింది. ఎక్కువ మంది మార్కెట్‌నిపుణులు ఈకొత్త ఏడాది అనిశ్చితంగానే ఉంటుందని చెపుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ ఆర్ధికనిపుణుడు సంజ§్‌ు మూకిమ్‌ అదే అభిప్రాయంతో ఉన్నారు. అమెరికాలో ఎక్కువ వడ్డీరేట్లు భారత్‌ ఈక్విటీలపై ప్రభావంచూపిస్తాయి. 2018 డిసెంబరు అంచనాలు సెన్సెక్స్‌ 32వేలుగా ఉంటుందని అంచనావేసారు.

విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 19,200 కోట్ల నికర కొనుగోళ్లు మందగమనంతోనే ఉన్నాయి. దేశీయ ఇన్వెస్టర్లు, మూచువల్‌ఫండ్స్‌, బీమా కంపెనీలు గడచిన మూడేళ్లుగా కొనుగోళ్లు పెంచాయి. మొత్తం కొనుగోల్ల విలువ 1.03 లక్షలకోట్లుగా ఉంది. వీటికితోడు కరెంటుఖాతా లోటు జిడిపిలో రెండుశాతానికి పెరుగుతుందని నోమురా అంచనా వేసింది. వ్యవసాయ రంగంలో సంక్షోభం కారణంగా ప్రభుత్వ విధానాలు మార్చాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేకాకుండా వాణిజ్యలోటుసైతం పెరిగే అవకాశం ఉందని, ఇక బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు మొత్తం అడ్వాన్సుల్లో 11.1శాతానికి మూడోత్రైమాసికంలో పెరిగాయి. అంతకుముందు ఏడాది 10.2నుంచి భారీగాపెరగడం వల్ల ఈ పరిస్థితుల్లో భారత్‌ మార్కెట్లకు అనిశ్చితి తప్పదన్న అంచనాలే వ్యక్తం అవుతున్నాయి.