కొత్తపన్నులు, రాయితీలు వచ్చేస్తున్నాయి.

TAX TIME-
TAX TIME-

కొత్తపన్నులు, రాయితీలు వచ్చేస్తున్నాయి.

న్యూఢిల్లీ, మార్చి 31: ఆర్థిక సంవ త్సరం ముగుస్తోంది. బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్నులు మినహాయింపులు వచ్చే ఒకటవ తేదీనుంచి అమలులోకి రానున్నాయి. ఆదాయపు పన్నుశాఖ పన్ను రేట్లు, శ్లాబ్‌లను యధాతథంగానే కొనసాగించినా బడ్జెట్‌లో రూ.40వేల వరకూ ప్రామాణిక తగ్గింపులను ఉద్యోగులు, పింఛన్‌దార్లకు ప్రవేశపెట్టింది. ఇక దీర్ఘకాలిక మూలధన లబ్దిపై పన్ను వంటివి లక్ష రూపాయలు లాభం దాటితే పదిశాతం పన్ను వంటిది కూడా అమలుకు వస్తోంది.

2018-19 ఆర్థికసంవత్సరం ప్రారంభంనుంచి ఈ పన్నును అమలుచేస్తారు. వీటితోపాటు ఇతర పన్ను ప్రతిపాదనలు కార్పొరేట్‌ పన్నును 25శాతంకి తగ్గింపు, 250 కోట్ల టర్నోవర్‌వరకూ ఉన్న సంస్థల కు ఈ మినహాయింపును వర్తింపచేయాలి. అలాగే ఉద్యోగులు, పింఛన్‌ దార్లకు ప్రామాణిక తగ్గింపును రూ.40వేల వరకూ వెఉలుబాటును ప్రవేశపెట్టింది. రవాణా భత్యాలు, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ వంటివి కూడా ఆదివారంనుంచి అమలుకు రావాల్సి ఉంది.

సీనియర్‌ సిటిజన్లకు వడ్డీరేట్ల తగ్గింపు ఐదురెట్లు అంటే ఏడాదికి రూ.50 వేల వరకూ పెంచింది. ఇక ఆరోగ్యబీమీ న్రపీమియం వైద్య ఖర్చులు వంటివాటిని రూ.50వేలకు పెంచింది. ఇప్పటివరకూ ఐటిచట్టం సెక్షన్‌80డి కింద వీటిని 30వేలవరకు మాత్రమే అనుమ తించింది. ఇక సీనియర్‌, మరింత సీనియ ర్‌ సిటిజన్లకు పన్ను తగ్గింపు సంక్లిష్ట అనారోగ్యంకు రూ.1లక్షల రూపాయ లు వరకూ అమలవుతున్నది. ప్రస్తు తం రూ.60వేలుమాత్రమే ఉంది. మరింత సీనియర్‌ సిటిజన్లకు రూ.80వేలవరకూ అమలవుతున్న ది. ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం చివరి బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ సూపర్‌ సంప న్నులపై 10-15శాతంసర్‌ఛార్జి విధిస్తోం ది. అలాగే ఆరోగ్యం, విద్యాసెస్‌లు పన్నువిధింపు ఆదాయమార్గా లకు తప్పనిసరి అయింది.

అంతకు ముందున్న మూడుశాతం నుం చి నాలుగు శాతానికి పెంచింది. ఈ ప్రతిపాదనలన్నీ ఏప్రి ల్‌ ఒకటవ తేదీ అంటే ఆది వారంనుంచి అమలుకువస్తాయి. ఇక తాజా బడ్జెట్‌లో 14 ఏళ్ల తర్వాత ఎల్‌టిసిజి పన్ను కింద పదిశాతం ప్రవేశపెట్టింది. ఆదాయం లక్ష రూపా యలకు మించితే ఈ పరిమితి పెరుగుతుంది.ప్రస్తుతం మూల ధన లబ్దిపై 15శాతం పన్ను విధిస్తుఆ్నరు. వాటాల విక్రయం ఏడాదిలోపు కొనుగోళ్లపైనే ఈ పన్ను వసూలుచేస్తున్నారు. అలాగే ఏడాది తర్వాత విక్రయించిన షేర్లకు ఎలాంటి పన్నులుండవు. ఇన్వెస్టర్లకు మరింత ఉపశమనం కలిగే విధంగా పన్ను లెక్కింపుల బాద్యత, వాటాల జాబితా జనవరి 31వ తేదీ తర్వాత అందుబాటులో ఉంటుందని ప్రకటిం చింది. 2004 జూలైలో ప్రభుత్వం ఎల్‌టి సిజి పన్నును ఈక్విటీలపై నిషేధించింది.

ఆ తర్వాత సెక్యూరిటీల లావాదేవీల పన్నుగా అమలుచేసింది. ఇక పన్ను రేట్లు, శ్లాబ్‌లను స్థిరంగానే కొనసాగిం చింది. బడ్జెట్‌కొత్తగా రూ.40వేల రూపా యలు ప్రామాణిక పన్ను తగ్గింపును వేతన ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రవేశ పెట్టింది. 2006-7నుంచి ఈ తగ్గింపుల ను నిలిపివేసింది. ప్రస్తుతం రూ.19,200 వరకూ ఎలాంటి ప్రయాణభత్యం పైనా, వైద్యఖర్చులు రూ.15వేలకు మంచిన ఎలాంటి ఖర్చులపైనా పన్నులు అమలుకావు. ఇపుడు వీటన్నింటి స్థానం లో కొత్త ప్రామాణికతగ్గింపు రూ.40వేలను ప్రవేశపెట్టింది.

కార్పొరేట్‌ పన్ను విధానంలో బడ్జెట్‌లో 250 కోట్లకు లోపు ఉన్న కంపెనీల పై పన్ను 25శాతానికి తగ్గించింది. 2015 బడ్జెట్‌లోజైట్లీ కార్పొరేట్‌పన్నును 30శాతం నుంచి 25శాతానికి నాలుగేళ్ల పాటు తగ్గించి అమలుచేస్తామని ఆనాడే హామీఇచ్చారు. 2018-19 కేంద్రబడ్జెట్‌ ఒక్కటే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న పూర్తిస్థాయి బడ్జెట్‌అని చెప్పాలి. కొత్తప్రభుత్వం ప్రవేశపెడుతున్నచివరి బడ్జెట్‌ ఇదేఅని చెప్పాలి.