కెవైసి లేని మొబైల్‌ వ్యాలెట్లకు నో!

digital wallet
digital wallet

బెంగళూరు: మీ మొబైల్‌ వాలెట్‌లోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించాలనుకుంటున్నారా? అయితే నేటి నుంచి అది సాధ్యపడదట. ఫుల్‌ కేవైసి (నో యువర్‌ కస్టమర్‌) విధివిధానాలను పూర్తిచేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ కేవైసి వివరాలనుఅందచేయని కస్టమర్లు తమ వాలెట్లలోకి కొత్తగా ఫండ్స్‌ను పంపిచుకోవడం జరగదు. ఇది డిజిటల్‌ పేమెంట్స్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బగా వెల్లడవుతోది. నేటి నుంచి రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా విధించిన కేవైసి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్‌ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్‌బిఐ విధించే నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 28 వరకు వాలెట్‌ యూజర్ల నుంచి కేవైసి వివరాలను పొందాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలకు రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. ఈ గడువును మరింత పొడిగించాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలు కోరాయి. కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్‌బిఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసి వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్‌ ప్రొవైడర్లు కోల్పోతున్నారు. ఫుల్‌ కేవైసి వివరాలు 10వేల రూపాయల వరకు ఆపరేట్‌ చేసుకునేలా డిజిటల్‌ వాలెట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రిజర్వ్‌బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కేవైసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనంటూ ఆర్‌బిఐ స్పష్టంచేసింది. దీన్ని బ్యాంకింగ్‌ ఎకో సిస్టమ్‌కు కూడా విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్లు కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్‌ వాలెట్‌ ఫౌండర్‌ విన§్‌ు కలాంత్రి అన్నారు. కానీ దీర్ఘకాలీన ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు. ఆర్‌బిఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పిచిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్‌ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాకుండా ఇతర వాలెట్లకు ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ చేయలేరు. అయితే వాలెట్‌లో ఉన్న ఫండ్స్‌ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాలెట్‌ నగదును కోల్పోకుండా, వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్‌ చేసుకునేలా కూడా ఆర్‌బిఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్‌ వాలెట్‌ సర్వీసులను వినియోగిస్తున్న 90శాతం కస్టమర్లు ఇప్పటివరకు కేవైసి వివరాలను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్‌ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు.