కీలక ఆస్తులను నగదీకరణ చేస్తున్న ఎయిర్‌ ఇండియా

Air india new Services

Air india new Services

కీలక ఆస్తులను నగదీకరణ చేస్తున్న ఎయిర్‌ ఇండియా

ముంబయి, ఆగస్టు 29: ప్రభుత్వరంగంలోని ఎయిర్‌ ఇండియా కీలకమైన 27 ఫ్లాట్లను విక్రయించాలని నిర్ణయించింది వాణిజ్యస్థలాలు, ఆఫీసు భవనాలు దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. స్థిరాస్థి నగదీకరణ కార్యక్రమం కింద పెట్టుబడుల ఉపసంహరణ విధానానికి ఎయిర్‌ ఇండియా కూడా చేరింది. రుణభారంతో సతమతం అవుతున్న ఎయిర్‌ ఇండియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రభుత్వరంగంలోని ఎంఎస్‌టిసి ఈ ఆస్థులను ఇవేలం వేస్తుంది సెప్టెంబరు ఆరవ తేదీ బిడ్ల దాఖలకు చివరితేదీగా నిర్ణయించింది.

పబ్లిక్‌నోటీస్‌ వివరాలప్రకారంచూస్తే ముంబై,బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై, తిరువనంతపురం, అహ్మదాబాద్‌, పూణె, గోవా, లక్నో, గ్వాలియర్‌, గుర్‌గావ్‌, భుజ్‌ ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయి. వీటి విక్రయం ద్వారా కనీసం రూ.500 కోట్లు రాగలవని ఎయిర్‌ ఇండియా అంచనావేసింది. 2012లోనే ఎయిర్‌ ఇండి యాకు జవసత్వాలిచ్చేందుకుగాను ప్రభుత్వం ప్యాకేజి ప్రకటించింది. 2021 వరకూ దశలవారీగా రూ.30,231 కోట్ల ఈక్విటీ నిధులు అందించేందుకు సిద్ధం అయింది. అంతేకాకుండా ఎయిర్‌ ఇండియా కూడా తనవద్ద ఉన్న కీలక ఆస్తులను ప్రస్తుతం ఉప యోగంలో లేనివాటినివిక్రయించి రూ.5వేల కోట్లు సమీకరించాలని చూస్తోంది. వీటిని అమ్మడం, లేదా లీజుకిచ్చే ప్రాతిపదికన నిధులు రాబడుతుంది. ఇప్పటివరకూ ఎయిర్‌ఇండియా తనకు ముంబైలో ఉన్నఫ్లాట్లలో కేవలం నాలుగింటిని మాత్రమే ఎస్‌బిఐ కి రూ.90 కోట్లకు విక్రయించింది. ఎయిర్‌ ఇండియా నికర రుణం రూ.48,876.81 కోట్లుగా ఉంది.

ఈమొత్తంలో రూ.17,359.77కోట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ రుణాలే ఉన్నాయి. మిగిలినమొత్తంరూ.31,517.04 కోట్లు మూలధన అవసరాలకు రుణాలను తెచ్చింది. ప్రభుత్వరంగంలోని ఈ విమానయాన సంస్థ నికర నష్టం రూ.3643 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లుగా ఉంది.
=====