కార్బన్‌8లో స్టాంజో ఇండియా ఒప్పందం

stanga
Stanzo deal

కార్బన్‌8లో స్టాంజో ఇండియా ఒప్పందం

హైదరాబాద్‌, అక్టోబరు 22: ఎల్‌ఇడి లైట్ల ఉత్పత్తిలో శరవేగంగా విస్తరిస్తున్న స్టాంజో ఇండియా లిమిటెడ్‌ సంస్థ కొత్తగా ఫైబర్‌ అప్టిక్‌ టెక్నాలజీ రంగంలో ప్రవేశించింది. ఇందుకోసం ఆ సంస్థ బ్రిటన్‌కు చెందిన కార్బన్‌ 8 సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ జీడి మెట్ల పారిశ్రామిక వాడలోని సంస్థలు ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా స్టాంజో ఇండియా మేనేజింగ్‌ డైరె క్టర్‌ నీరజ్‌ లా కోటియా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థ రానున్న కాలంలో ఫైబర్‌ అప్టిక్‌ టెక్నాలజీ రంగంలో ప్రవే శించి స్మార్ట్‌ సిటీలతో పాటు ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తుందని చెప్పారు. తమ సంస్థ గత దశాబ్దకాలంగా ఎల్‌ఇడి లైట్ల ఉత్పత్తిలో నిరరతరం పరిశోధనలు చేస్తోందని, ఇందుకోసం ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకుందని ఇప్పటికే ఏటా సుమారు 60కోట్ల మేర లావాదేవీలు సాగుస్తుందని లా కోటియా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్బన్‌ 8 సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాన్‌ మార్ఫ్య్‌, స్టాంజో నేషనల్‌ హెడ్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, టెక్నికల్‌ హెడ్‌ జయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.