కార్పొరేట్‌,వ్యక్తిగత పన్నుపరిమితులపైనే అన్ని ఆశలు!

tax relief
tax relief

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ మరో వారంరోజుల్లో ప్రవేశపెడుతున్న తరుణంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితుల తగ్గింపుతోపాటు ఆర్ధికసంవత్సరాన్ని కేలండర్‌ సంవత్సరానికి తీసుకురావాలని ఎక్కువ మంది పన్నులరంగనిపుణులు కోరుతున్నారు. ఆర్ధికసంత్సరం మార్చి-ఏప్రిల్‌తో ముగిస్తే కేలండర్‌ సంవత్సరం జనవరి డిసెంబరుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆర్ధికసంవత్సరాన్నిసైతం మార్చేలక్ష్యంతోప్రభుత్వం పనిచేస్తున్నందున పన్ను సంవత్సరాన్ని కేలండర్‌సంవత్సరంగా మార్చాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత పన్ను, కార్పొరేట్‌పన్ను తగ్గింపులతోపాటు పన్నుబ్రేక్‌లలో కూడా సడలింపులు ఇవ్వాలనికోరుతున్నారు. పిల్లలకు విద్య వంటి వాటిలో కూడా పన్ను మినహాయింపులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ సంస్థల్లో పనిచేసే 700 మందికిపైగా పనిచేస్తున్నమేనేజర్లను సర్వేచేస్తే అత్యధికశాతం అంటే 84శాతం మంది పన్నుసంవత్సరాన్ని కేలండర్‌సంవత్సరానికి మార్చాలని సూచించారు. 52శాతం మంది మాత్రం వ్యవసాయ ఆదాయాన్ని సైతం పన్నుపరిధిలోనికి తీసుకురావాలని సూచించారు. ఆసక్తికరంగా మరో మూడోవంతు మేనేజర్లు అంటే 33శాతం మంది వ్యవసాయ ఆదాయంపై పన్నువిధింపును వ్యతిరేకించారు. సర్వేలో 64 మంది మేనేజర్లు అవధుల్లేని స్వేఛ్ఛాయుత ఇ-మదింపులకు ప్రాధాన్యతనిచ్చారు. పన్నులశాఖ ఇటీవలే ఇ-అసెస్‌మెంట్లను జారీచేస్తోంది. పన్నుచెల్లింపులదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించి అవినీతిని నిర్మూలించేందుకు ఇఅసెస్‌మెంట్‌ తోడ్పడుతుందని అంచనా. అయితే 20శాతం మంది ఇది యంత్రమాత్రంయ్రోజనకారి కాదని అంటే మరో 16శాతం మంది ఈ విధానం ఎంతవరకూ ఉపకరిస్తుందో చెప్పలేమన్నారు. కార్పొరేషన్‌ పన్నులపరంగాచూస్తే దేశీయ కంపెనీలు 30శాతంనుంచి 25శాతానికి తగ్గించాలనిసూచించారు. అదేస్థాయిలో వ్యక్తిగత పన్నుచెల్లింపుదారులకు సైతం ఉండాలని 86శాతం మంది సూచించారు. పన్నురేట్లను తగ్గించడం వల్ల మరింతగా నగదు వినియోగదారులకు చేరుతుందని వెల్లడించారు. దీనివల్ల దేశీయంగా డిమాండ్‌పెరుగుతుందని అంచనావేసారు. వేతన ఉద్యోగులకు సెక్షన్‌ 80సిని మరింతగా పరిమితిపెంచాలని నిర్దిష్టమైన చెల్లింపులు, పెట్టుబడులకు ఈ మినహాయింపుపెరగాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 1.50 లక్షలవరకూ పరిమితి ఉందని, 80శాతం మంది 80సి మినహాయింపును 2.50 లక్షలకు పెంచాలకోరారు. మరో 20శాతం మంది రెండులక్షలు ఉండాలన్నారు. దీనివల్ల వ్యక్తిగత పన్నుచెల్లింపుదారులు మరింతగాపొదుపుచేస్తారని అన్నారు. పన్నులు ఆదాచేయగలిగే ఇన్‌ఫ్రా బాండ్లను మళ్లీ ప్రవేశపెట్టాలని కోరారు. 50వేలపరిమితికి వీటిని జారీచేయాలని కోరారు. 21శాతం మంది వీటిపై ఆదాయపు పన్ను తగ్గింపుపరిమితిని రూ.35వేలుగా ఉంచాలనిసూచించారు. ఇక విద్యారంగపరంగాచూస్తే ఎక్కువ మంది సర్వేలో పాల్గొన్న ఆర్ధికరంగనిపుణులు 94శాతంమంది అదనపు తగ్గింపులు కూడా ఉండాలని కోరారు. తమపిల్లలకు విద్యాఖర్చుల్లో కనీసం పన్ను తగ్గింపుపరిమితిని రూ.50వేలకు కుదించాలని సూచించారు. 55శాతం మంది లక్ష రూపాయలుగా ఉంచాలని, 39శాతం మంది సాలీనా 50వేలకు పరిమితి విదించాలనిసూచించారు. ఇక ప్రాథమికంగా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని 2.5 లక్షలనుంచి మూడులక్షలకు పెంచాలని సూచించారు. 29శాతంమంది నాలుగులక్షలవరకూ ఆదాయపు పన్నుమినహాయింపు ఉండాలన్నారు. మిగిలినవారుమినహాయింపు పరిమితి ఐదులక్షలకు పెంచాలనిసూచించారు. ఇక వైద్యఖర్చులపరంగా పన్ను మినహాయింపు పరిమితి రూ.15వేలుగా ఉందని, వీటిని 40వేలకు పెంచాలని కొందరు కోరితే మరికొందరు 30వేలకు పెంచాలని సూచించారు. ప్రస్తుతం వేతన ఉద్యోగులు విద్యాభత్యంకింద నెలకు రూ.100మినహాయింపు ఉందని, ఇద్దరు పిల్లలవరకూ మినహాయింపు ఉందని తేలింది. ఎక్కువశాతం మంది ఈ పరిమితిని రూ.5వేలకు పెంచాలని ఒకొక్కక్కరికి ఐదువేలుగా ఉండాలనిసూచించారు. 20శాతం మంది పిల్లల్లో ఒక్కొక్కరికీ రెండువేలు చొప్పున నెలసరి ఉండాలనిచెపితేమరికొందరు నెలసరి మూడువేలుగా ఉండాలని సూచించారు. కంపెనీ యాజమాన్యం ఏదైనా ఉద్యోగులకు ఉచిత భోజనం కేటాయిస్తే రూ.50దాటితే పన్నుపరిధిలోనికివస్తుంది. ఈ పరిమితిని రూ.100కు పెంచాలనికొందరు,రూ.200కు పెంచాలని మరికొందరు కోరారు. స్వయంసంపాదిత ఆస్తులపరంగాచూస్తే 50శాతం మందిమేనేజర్లు ఎవరికైతే సొంత ఇల్లు ఉందో వారికి గృహరుణాల తగ్గింపుపరిమితిని రూ.2లక్షలనుంచి ఐదులక్షలకు పెంచాలని కోరారు. 38శాతం మంది ఈ తగ్గింపు పరిమితిని రూ.3.50లక్షలకు పెంచాలని కోరారు. ప్రత్యేకించివ్యక్తిగత ఆదాయపు పన్నుపరిమితి పెంపుపైపే ఎక్కువమంది మూడు లక్షలకు మొగ్గుచూపించడం విశేషం.