కపిల్‌ చోప్రా రాజీనామా

KAPIL CHOPRA
KAPIL CHOPRA

కపిల్‌ చోప్రా రాజీనామా

ముంబై,జనవరి 1: ఓబెరా§్‌ు గ్రూప్‌ అధ్యక్షుడు కపిల్‌ చోప్రా తన పదవికి రాజీనామా చేసారు. ఓబెరా§్‌ు కుటుంబానికి చెందని మొదటి అధ్య క్షుడిగా మార్కెట్లను ఆకర్షించిన చోప్రా గత ఏప్రియల్‌లోనే రాజీనామా చేసేం దుకు సిద్థమయ్యారని 89 సంవత్సరాల గ్రూప్‌ అధినేత పియస్‌ఆర్‌ ఓబెరా§్‌ు సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. తన సొంత సంస్థ అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకే ఓబెరా§్‌ు గ్రూప్‌ను వీడుతున్నట్లు తెలిపారు. కపిల్‌ చోప్రా ఈజీడైనిర్‌ పేరుతో స్థాపించిన తన సొంత సంస్థ విలువ 250కోట్లకు చేరుకుంది. ఇంటర్నెట్‌ ద్వారా టూరిస్టులకు, వినియోగదారులకు టిక్కెట్లు, హోట ళ్ళ.. బుక్‌చేయటం వంటి సేవలను అందిస్తుంది. చోప్రా ఓబెరా§్‌ు గ్రూప్‌ను వీడటంపై మార్కెట్లలో ప్రతికూల ప్రభావం ఉండదని తన లేఖలో పియస్‌ఆర్‌.ఓబెరా§్‌ు సంస్థ ఉద్యోగులకు తెలిపారు.