కనీస ఛార్జీలు అవసరం లేదు

telecom
telecom

కనీస ఛార్జీలు అవసరం లేదు

టెలికాం కంపెనీలకు ట్రా§్‌ు వివరణ

ముంబయి, జూలై 22: టెలికాం సంస్థలకు ట్రా§్‌ు మరోషాక్‌ ఇచ్చింది. కాల్స్‌, డేటా వినియోగానికి కనీస ఛార్జీ లు విధించాలన్న టెలికాం సంస్థల వాదనను ట్రా§్‌ు తిరస్కరిం చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస ఛార్జీల అవసరం లేదని చెప్పింది. ఈమేరకు ట్రా§్‌ుఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ తననిర్ణయం ప్రకటించారు. టెలికాం రంగంలోని పలుసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమా వేశం అనంతరం కనీనఛార్జీల విధింపుప్రస్తుత పరిస్థితుల్లో అనవసర మని ఆయన అన్నారు. రిలయన్స్‌జియో రాకతో నష్టాలు చవిచూసి న పలు టెలికాం కంపెనీలు ఆర్ధికంగా గట్టేక్కేందుకు కాల్స్‌,డేటాకు కనీస ఛార్జీలు విధించాలని కోరాయి. దీనిపై విచారణజరిపిన ట్రా§్‌ు కంపెనీల వాదనను తోసిపుచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తులు చేసామని తదుపరి వాదనకు అవకాశం లేదని స్పష్టంచేసింది. ఈసమావేశంలో కనీసఛార్జీలు ఉండాల్సిందేనని ఐడియాపట్టుబట్టగా ఆ వాదనను జియో తోసిపుచ్చింది. జియోరాకతో ఇతర ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌ కంపెనీలకు చమ టలు పట్టాయి. మరోవైపు ఇప్పటికే ఆర్థికంగా కుదలైన ఆయా టెలికాంకంపెనీలకు నేడు రిలయన్స్‌ అధి నేత ముఖేష్‌ అంబానీ మరోషాక్‌ ఇచ్చారు.ఉచితంగానే జియోఫోన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో అన్ని టెలికాం కంపెనీలషేర్లు భారీగాపతనమయ్యాయి. అదేసమయంలో రిలయన్స్‌షేర్లు ర్యాలీతీసాయి.