కంపెనీ మారాలంటే పన్ను కీలకం

TAX
TAX

కంపెనీ మారాలంటే పన్ను కీలకం

న్యూఢిల్లీ,సెప్టెంబరు 17: ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాలంటే పన్ను కీలకం కానుంది.కాగా కంపెనీలు మారడం అనేది ఈ రోజుల్లో సహజమే. ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో తరచూ ఉద్యోగాలు మారటం కూడా అసాధారణమేమీ కాదు. కాకపోతే కంపెనీలు మారే టప్పుడు పన్ను బాధ్యతల్ని మరచిపోకూడదు. ఇలా జంప్‌ చేసేటప్పుడు పన్నుపరంగా సమస్యలు రాకుండా కొన్ని విషయాలపై అవగాహణ పెంచు కోవడం అవసరమని తెలుసుకోవాలి. వార్షి కంగా ఒక ఉద్యోగికి చెల్లిస్తున్న వేతనం ఆధారంగా ఆ ఉద్యోగి చెల్లించాల్సిన పన్నును కంపెనీ లెక్కిస్తుంది. దాన్ని ప్రతి నెలా వేత నంలో నిర్ణీత శాతం చొప్పున మిన హాయిస్తుంది.

ఒకవేళ ఆర్థిక సంవ త్సరం మధ్యలో కంపెనీ మారితే కొత్తగా చేరిన కంపెనీలో గత వేత నం గురించి తెలియజేయాలి. లేదంటే రిటర్నుల దాఖలు సమ యంలో అదనపు పన్ను చెల్లిం చాల్సి రావచ్చు. ఎందుకంటే రెండు కంపెనీల్లోను 2.5 లక్షల బేసిక్‌ ఎగ్జంప్షన్‌కు తోడు 1.5 లక్షలు సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపును పరిగణలోకి తీసు కుంటారు. అలాగే పన్ను లెక్కించేటపుడు దిగువ స్థాయి టాక్స్‌ స్లాబ్‌ను పరిశీలలోకి తీసుకుంటారు. పాత కంపెనీలో వేతన సమాచారాన్ని కొత్త కంపెనీలో నిర్ణీత పత్రంలో తెలియజేస్తే నిబంధనల మేరకు పన్ను మినహాయిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక కొత్త కంపెనీ కన్సాలిటేటెడ ఫామ్‌-16ను జారీ చేస్తుంది. ఇందులో పాత కంపెనీ వేతన సమాచారంతో పాటు టిడిఎస్‌ వివరాలు కూడా ఉంటాయి. ఒకవేళ పాత కంపెనీ వేతన వివరాలను కొత్త కంపెనీలో ఇవ్వకుంటే రెండు కంపెనీల్లోనూ జారీ చేసిన పామ్‌ 16లను పరిగణలోకి తీసుకుని పన్ను రిటర్నులను స్వయంగా వేయాలి.ఈ మేరకు పన్ను కూడా కట్టాలి. ఒక ఆర్థిక సంవత్సరం మధ్య లో కంపెనీ మారినప్పటికి మినహాయింపులను ఒక్క సారే క్లెయిమ్‌ చేసుకోవాలి.

ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా దగ్గర ఉంచుకుంటే భవిష్యత్తు లో పన్ను ఆధికారులు అడిగితే చూపించడానికి ఉంటుంది. కాగా నాలుగు సంవత్సరాల కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి రెండు సార్లు పర్యటనల కోసం చేసిన ఖర్చులను లీవ్‌ ట్రావెల అలవెన్స్‌ నిబంధనల కింద పన్ను క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలుంది.ఈ నాలుగు సంవత్సరా సమయంలో ఎన్ని కంపెనీలు మారినా రెండు సార్ల కు ఈ అవకాశం.హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్స్‌లకున్న పన్ను మినహాయంపు సౌకర్యాన్ని పొందేందుకు ఏటా జనవరిలో ఉద్యోగం చేస్తున్న సంస్థకు ఆధా రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జనవరిలోపే కంపెనీ మారిపోతే పన్ను మినహాయింపులు కోల్పో వాల్సి వస్తుంది. ఎందుకంటే పాత కంపెనీ ఈ మేరకు పన్నును ఐటిశాఖకు జమ చేస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే పన్ను రిటర్నుల సందర్భంగా క్లెయిమ్‌ చేసుకోవాల్సి వస్తుంది.

ఆర్థిక సంవత్సరం మద్యలో అంటే అక్టోబరు లోపే విదేశీ జాబ్‌ కోసం వెళ్లిపోతే ఎన్‌ఆర్‌ఐగా పరిగణిస్తారు. కనుక ఇక్కడ పన్ను కట్ట క్కర్లేదు. ఒకవేళ రెసిడెంట్‌ ఇండియన్‌ అని భావిస్తే విదేశీ ఆదాయంపై ఇప్పుడే పన్ను చెల్లించాలి. ఆర్గనై జేషన్‌ మారుతున్నప్పుడు పే స్లిప్‌లు, ఫామ్‌ 16,10సి (పిఎఫ్‌ఉప సంహారణకు సంబంధించి) ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ స్టేట్‌మెంట్‌ మొదలైనవి తప్ప కుండా తీసుకోవాలి.కంపెనీ మారినపుడు పిఎఫ్‌ ఉప సంహరించుకుంటే పన్ను కట్టాల్సి వస్తుందేమో చూడాలి.

ఎందుకంటే అయిదు సంవత్సరాలు పూర్తి కాకుండా పిఎఫ్‌ నిధులను వెనక్కి తీసుకుంటే నిబంధనలప్రకారం పన్ను చెల్లించాలి. ఉపసంహరించుకున్న మొత్తాన్ని సాధారణ ఆదాయం కింద పరిగణించి పన్ను కట్టా లి. దీనికి బదులు నూతన కంపెనీకి పిఎఫ్‌ బదిలీ చేసు కోవడంఉత్తమం.కొన్ని కంపెనీ ల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు జాయి నింగ్‌ బోనస్‌ ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ బోనస్‌ కంపెనీ పన్నును తగ్గించి ఇస్తుంది. అయితే చేరిన ఆరు మాసాల్లోనే ఈ కంపెనీకి గుడ్‌ బై చెబితే తీసుకున్న బోనస్‌ తిరిగి ఇవ్వాలి.

అందుకున్న నిక బోనస్‌తో పాటు కంపెనీ ఉపసంహరించుకున్న పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందు కంటే పన్ను రూపంలో తీసుకున్న మొత్తాన్ని కంపెనీ ఐటి శాఖకు జమ చేస్తుంది. ఉదహారణకు శ్రీరామ్‌ ఎ కంపెనీలో చేరిన సందర్భంగా కంపెనీ లో లక్ష రూపాయల బోనస్‌ ఇచ్చింది.30 శాతం పన్నును ఉపసంహరించుకుని 70 వేలు చెల్లిం చింది. చేరిన ఆరు నెలల్లోనే శ్రీరామ్‌ కంపెనీకి రాజీ నామా చేశాడు. దీంతో అతడు లక్ష రూపాయలను కంపెనీకి కట్టాల్సి ఉంటుంది. కాగా 30 వేలను రిఫండ్‌ కోసం ఐటి శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.