ఒక్క ఏడాదిలో రూ.1.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు

FUNDS
FUNDS

ముంబయి: విదేశీ ఇన్వెస్టర్లు గతకేలం డర్‌ సంవత్సరంలో రూ.1.5 లక్షలకోట్ల నిధులను డెట్‌ మార్కెట్లలో కుమ్మరించారు. స్థిరమైన కరెన్సీ రేట్లు, ఎక్కువ బాండ్లరాబడులను అంచనావేసిన ఇన్వెస్టర్లు ఎక్కువగా డెట్‌రంగంలోపెట్టుబడులు కుమ్మరించారు. అంతకుముందు ఏడాది ఈ రంగం నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కుతీ సుకున్న విదేశీ ఇన్వెస్టర్లుఈఏడాది భారీగా కుమ్మ రించారు. మొత్తం నికరంగా 2017లో డెట్‌మార్కె ట్లకు విదేశీ ఇన్వెస్టర్ల పరంగా మంచి మార్కెట్‌గా పరిణమించింది. 2014 తర్వాత 2017లోనే ఎక్కువ పెట్టుబడులు అందాయి. ఇక విదేశీ పోర్టు ఫోలియో పెట్టుబడులు ఈ ఏడాది అంతగా రాకపో వచ్చని,వడ్డీరేట్ల కారణంగా నగదు లభ్యత కూడా తగ్గుతుందని అంచనాలున్నాయి. వీటికితోడుద్ర వ్యోల్బణ హెచ్చుతగ్గులు కూడా వివిధ ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల కనిపిస్తుందని, దీనివల్ల విని యోగరం గడిమాండ్‌లో కొంత రికవరీ ఉంటుందని అంచనావేస్తున్నారు. డిపాజిటరీస్‌ తాజా గణాం కాలప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.49 లక్షలకోట్లు డెట్‌ మార్కెట్లలో కుమ్మరించారు. 2016లో కేవలం రూ.43,645 కోట్లుమాత్రమే వచ్చాయి. ఈ డెట్‌రంగ ఉత్పత్తుల పెట్టుబడులు నికరంగా 2015లో 458.56 బిలియన్‌ రూపాయలుకాగా 2016లో 1.6 లక్షలకోట్లుగా ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో రూ.510 బిలియన్ల విలువైన కొనుగోళ్లు జరిపారు. గడచినరెండేళ్లలో రియల్‌ వడ్డీరేట్లు భారత్‌లో ఎక్కువ ఉన్నాయి. స్థిరమైన కరెన్సీ రేట్లు విదేశీ ఇన్వెస్టర్లను డెట్‌రంగంలోనికి ఆకర్షింపచేసాయని క్వాంటమ్‌ ఎంఎఫ్‌ఫండ్‌మేనేజర్‌ పంకజ్‌పాఠక్‌ వెల్లడించారు. ఇదే అభిన్రపాయాన్ని మార్నింగ్‌స్టార్‌ అడ్వయిజర్స్‌ సీనియర్‌ఆర్ధికవేత్త హిమాంశు శ్రీవాస్తవ వెల్లడించారు. పదేళ్ల ప్రభుత్వబాండ్లు ఇతర దేశాలు అమెరికా, బ్రిటన్‌,జపాన్‌,ఫ్రాన్స్‌ దేశాల బాండ్లజారీ కంటే ఎక్కువరాబడులు ఇస్తున్నాయి. దీనివల్లనే పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు డెట్‌రంగంపై ఎక్కువదృష్టి పెట్టారు. గడచిన రెండు దశాబ్దాలుగా 1992నుంచి ఇప్పటివరకూ రూ.2.64 లక్షలకోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముందుప్రతికూలంగానే ప్రా రంభం అయింది. రానురాను నిధులరాకపెరిగింది. అయితే ఈ నిధులరాక 2018లో అదేతీరులో కొన సాగుతుందని చెప్పలేమని ఎఫ్‌పిఐలు వడ్డీరేట్ల పెం పుతో కొంతమేరఉపసంహరించుకునే అవకావంలేక పోలేదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.