ఒకటిన్నరేళ్ల గరిష్టస్థాయికి రూపాయి

cash
coins

ఒకటిన్నరేళ్ల గరిష్టస్థాయికి రూపాయి

ముంబై: డాలరులతో రూపాయి మారకం విలువలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఒకటిన్న రేళ్ల గరిష్టస్థాయికి పెరిగాయి. 2015 అక్టోబరు నుంచి డాలరుతో రూపాయి మారకం విలువలు కొంతమేర సానుకూలంగా పెరుగుతున్నట్లు అంచ నా. సోమవారం కూడా ఏడాదిన్నర గరిష్టస్థాయికి రూపాయి చేరింది. అంతేకాకుండా ఇతర ఆసియా కరెన్సీల్లో కూడా పెరుగుదలను నమోదుచేసింది. అమెరికా అధ్యక్షుడు డనాల్ట్‌ట్రంప్‌ హెల్త్‌కేర్‌రంగం లోని సంస్కరణల బిల్లును ఆమోదింపచేసుకోవ డంలో విఫలం కావడం, ఆమెరికా ఆర్థిక ఉద్దీపనల పై ఆందోళనలు వెల్లువెత్తడమే ఇందుకు కీలకంగా మారిందని చెప్పాలి. భారతీయ రిజర్వుబ్యాంకు రూపాయి లాభాలను సానుకూలం చేసుకునే దిశగా కృషిచేస్తోంది. వీటికితోడు డెట్‌, ఈక్విటీ రంగాల్లోనే ఈనెలలో 6.1బిలియన్‌డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. స్థానిక యూనిట్లలో ఉన్న లాభాలు పటిష్టమైన డాలర్‌ రాకను చూపి స్తోంది. బాండ్‌మార్కెట్లపరంగా మరింత పటి ష్టం అయ్యాయి. బెంచ్‌మార్క్‌పదేళ్లబాండ్ల రాబ డులు 12బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.71శాతానికి చేరాయి. ఫిబ్రవరి 8వ తేదీనాటి కనిష్టస్థాయిని నమోదుచేసినట్లు సెంట్రల్‌బ్యాంకు విశ్లేషిస్తోంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సానుకూల స్థాయి నుంచి తన ద్రవ్యవిధాన సమీక్ష తీరును తటస్థ స్థాయికి తెచ్చింది. సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతి కంపె నీలు, ఔషధ తయారీ కంపెనీల షేర్లు మాత్రం పతనం అయ్యాయి. రూపాయి పటిష్టం కావడమే ఇందుకుకీలకం. ఎన్‌ఎస్‌ఇ సూచి 0.75శాతం దిగజారి 9039 పాయింట్లకుచేరింది. బెంచ్‌మార్క్‌ బిఎస్‌ఇ సూచీ 0.69శాతం క్షీణించి 29,218.19 పాయింట్లకు చేరింది. ట్రంప్‌ తన సొంత రిపబ్లికన్‌ పార్టీ నుంచే హెల్త్‌కేర్‌ సంస్కరణల బిల్లుకు ప్రతి కూలత చవిచూసారు. దీన్నిబట్టి ట్రంప్‌ తన ఎన్ని కల అజెండా హామీల అమలుపై పలు సందేహా లను కూడా వ్యక్తంచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు, దేశీయ స్థితిగతులు మార్కెట్ల లకు కీలకం అయ్యాయిని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అధిపతి వినోద్‌ నాయర్‌ అన్నారు. రూపాయి 65.0575వద్ద ట్రేడింగ్‌జరిగింది. మరిం త పటిష్టంఅయి 65.01 రూపాయలుగా నడిచిం ది. 2015 అక్టోబరునాటి గరిష్టస్థాయిని నమోదు చేసింది. టెక్‌మహీంద్ర 2.2శాతం, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ 1.9శాతం క్షీణించాయి. ఔషధ సంస్థ లు కూడా పతనం అయ్యాయి లూపిన్‌, అరబిందో ఫార్మా రెండుశాతం, 1.8శాతం క్షీణించాయి. ఇత రత్రా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.42శాతం క్షీణించిం ది. సెబి కంపెనీ స్వల్పకాలిక ట్రేడింగ్‌ పొజిషన్లలో మోసం చేసిందన్న నిర్ణయాన్ని ప్రకటించడమే ఇందుకు కీలకం. తన వాటాను విక్రయాల సంద ర్భంగా పదేళ్లక్రితం ఒక యూనిట్‌లో అవకతవక లకు పాల్పడిందని అంచనా. అయితే రిలయన్స్‌ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాము అప్పీలుకువెళతామని ప్రకటించింది. అలాగే కోల్‌ ఇండియాసంస్థ కూడా 2.5శాతం దిగజారిం ది. రెండోసారి కోల్‌ ఇండియా ప్రకటించిన డివి డెండ్‌ ఇన్వెస్టర్లను నిరాశపరచడమే ఇందుకుకీలకం.