ఐసీఐసీఐ బ్యాక్‌షేర్లు భారీగా లాభపడ్డాయి

ICICI
ICICI

ముంబయి: ఈరోజు నాటి ట్రేడింగ్‌లో ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. నికర వడ్డీ లాభాలు పెరగడం, రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎన్‌పీఏల పై ప్రొవిజన్లు తగ్గించడం వంటి మదుపరులకు సానుకూల సంకేతాలను పంపించింది. గత సంవత్సరంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం ఈసారి రెండో త్రైమాసికంలో 42శాతం తగ్గి 1,204కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సీజన్‌లో మొత్తం ఏకీకృత నికర లాభం రూ.2,071కోట్లగా నమోదు చేసింది. దీంతోపాటు గత ఏడాది రూ.4,502కోట్లను ఎన్‌పీఏలకు ప్రొవిజన్లుగా ఏర్పాటు చేయగా.. ఈసారి దానిని రూ.3,994కు తగ్గించింది. ఇక చిల్లర రుణాల విభాగంలో 20 వ్యాపారం పెరగ్గా.. డిపాజిట్లు 12శాతం పెరిగాయి.