ఐసిఐసిఐకేసులో మితిమీరిన చొరవచూపుతున్న సిబిఐ

jaitly
jaitly

ట్విట్టర్‌లో ధనుమాడిన ఆర్ధికమంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌రంగంలో అనవసర సాహసచర్యలకు దిగవద్దని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దర్యాప్తు సంస్థ సిబిఐకి హితవు పలికారు. ఐసిఐసిఐబ్యాంకు ఎండి సిఇఒ చందాకొచ్చర్‌ రవీడియోకాన్‌గ్రూప్‌కు రుణం మంజూరుకేసులో బ్యాంకు ఛైర్మన్‌ కెవికామత్‌ మరికొందరిని ప్రశ్నించాలనినిర్ణయించడం,ఎఫ్‌ఐఆర్‌లో వారిపేర్లనుసైతం చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసారు. ఆర్ధికనష్టంపైనే దృష్టికేంద్రీకరించాలేకానీ అనవసర చర్యలకు పోకూడదని ఆయన సూచించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఆమెరికానుంచే మాట్లాడారు. భారత్‌లో శిక్షలు పడుతున్న రేట్‌ తగ్గుతుండటంతోనే ఇదంతా సాధ్యం కావడంలేదని అన్నారు. ఇన్వెస్టిగేటర్లు వృత్తిపరమైన కార్యదక్షతవెనక్కినెట్టేస్తునఆనరని ఆయన విమర్శించారు. చందాకొచ్చర్‌పైనా, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌పైనా సిబిఐ కేసులు నమోదుచేసినసంగతి తెలిసిందే.సిబిఐ తన నివేదికలో ఛైర్మన్‌ కెవికామాత్‌ ఐసిఐసిఐబ్యాంకు సిఇఒ సందీప్‌ బక్షి, గోల్డ్‌మాన్‌శాక్స్‌ భారత్‌ ఛైర్మన్‌ సంజ§్‌ుఛటర్జీ, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌బ్యాంకు సిఇఒ జరీన్‌ దారువాలా, టాటాక్యపిటల్‌ హెడ్‌ రాజీవ్‌సభర్‌వాల్‌, టాటాక్యాపిటల్‌స ఈనియర్‌ సలహాదారు హోమి ఖుస్రోఖాన్‌ వంటివారిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని, అత్యధిక విలువలున్న రుణాలను బ్యాంకు మంజూరుచేసినందునప్రత్యేకించి వీడియోకాన్‌గ్రూప్‌నకు ఇచ్చినరుణాలపైనే ఎక్కువ దృష్టికేంద్రీకరించింది. ప్రాథమికంగా విచారణ సాహసకృత్యాలు, వృత్తిపరమైన విచారణ వంటి వాటిమధ్య చాలా తేడా ఉంటున్నదని దర్యాప్తు సంస్థలు అనవసర చొరవకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ఐసిఐసిఐకేసులో తాను లక్ష్యాలను చదివానని లక్ష్యాలపై కంటే ఇపుడు అనవసర చొరవచూపించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలులేకుండానేముందు ప్రముఖలను నమోదుచేయకూడదని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంతో బాధాకరం అవుతుందని జైట్లీ సూచించారు.