ఐడిబిఐ బ్యాంకు కుంభకోణం రూ.772 కోట్లు

IDBI
IDBI

ముంబై: మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్‌ రూ.772కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీఅయినట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు ఫిష్‌ ఫామింగ్‌ బిజినెస్‌దారులకు జారీఅయినట్లు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్లు బ్యాంకు గుర్తించింది. ఐడిబిఐ ఈ కుంభకోణ వివరాలను బయటికి వెల్లడించగానే, బ్యాంకు షేర్లు 3.5శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్‌ రంగ బ్యాంకుల నిఫ్టీ పిఎస్‌యూ బ్యాంకు సూచి కూడా 1.8శాతం క్షీణించింది. తమ ఉద్యోగాల్లో ఇద్దరు ఈ రుణాల జారీ ప్రక్రియలో తప్పిదాలు చేసినట్లు ఐడిబిఐ తెలిపింది. వీరిలో ఒక అధికారిపై బ్యాంకు వేటు వేయగా, మరో అధికారి ఇప్పటికే పదవీ విరమణ అయ్యారు.