ఐడిబిఐ బ్యాంకుపై రూ.3కోట్ల జరిమానా

IDBI
IDBI

ముంబయి: భారతీయ రిజర్వుబ్యాంకు రూపొందించిననిబంధనలు పాటించడంలోను, అమలుచేయడంలోను విఫలం అయినందుకుగాను ఐడిబిఐ బ్యాంకుపై ఆర్‌బిఐ రూ.3కోట్ల జరిమానా విధించింది. ఆర్‌బిఐ మార్గదర్శకాలు అమలుచేయని కారణంగా ఆదాయవనరుల గుర్తింపు, స్థిరాస్థి వర్గీకరణపరంగా బ్యాంకు ఐఆర్‌ఎసి నిబంధనలు పాటించలేదని ఆర్‌బిఐ వెల్లడించింది. ఆర్‌బిఐ చట్టం 47ఎ(1)(సి)ప్రకారం బ్యాంకింగ్‌క్రమబద్దీకరణ చట్టం 1949 అధికరణలనుఅ నుసరించి ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. ఇక ప్రభుత్వపరంగా మార్గదర్శకాలు అమలుచేయడంలో విఫలం అయినందుకుగాను, ఈ జరిమానా పడింది. గత ఏడాది మేనెలలో ఆర్‌బిఐ బ్యాంకుపై రానిబాకీలపరంగా స్థిరాస్థి రిటర్నులపరంగాను తక్షణ కార్యాచరణను చేపట్టింది. ఐడిబిఐ తనవాదనను వినిపిస్తూ ఈ జరిమానా వల్ల బ్యాంకు పనితీరుపై ఎలాంటిప్రభావం ఉండబోదని, అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థను మరింతమెరుగుపరిచి మరింతగా కార్యకలాపాలు వృద్ధిచేస్తామని అన్నారు.