ఐడిబిఐ కొనుగోలుకు ఎల్‌ఐసి రెడీ!

idbi
idbi

ఐడిబిఐ కొనుగోలుకు ఎల్‌ఐసి రెడీ!

ముంబయి: ప్రభుత్వరంగంలోని జీవితబీమా సంస్థ ఐడిబిఐలోని వాటాలను కొను గోలుచేసేందుకు ప్రభుత్వ అనుమతిని కోరింది. బ్యాంకులోని ప్రమోటార్‌ వాటాలనుసైతం స్వాధీనంచేసుకునేదిశగా ఎల్‌ఐసి పావులు కదుపుతోంది. దీనితో బీమా కంపెనీ భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకిసైతం ప్రవేశించినట్లవు తుంది. ప్రస్తుతం భారతీయ జీవితబీమాసంస్థ (ఎల్‌ఐసి)కి బ్యాంకులో 8శాతం వాటా ఉంది. ప్రస్తుతం అదనంగా 43శాతం వాటాలను కొను గోలుచేయాలని నిర్ణయించింది. వీటి విలువ సుమారు రూ.10,500 కోట్లుగా ఉంది. దీనితో ఎల్‌ఐసి మొత్తం వాటా బ్యాంకులో 51శాతానికి చరుతుంది. ఎనిమిదిశాతంనుంచిక్రమేపీ మొత్తం ప్రమోటర్‌ వాటాలపైనే ఎల్‌ఐసి దృష్టిపెట్టింది.

ఐడిబిఐ బ్యాంకులోప్రభుత్వ వాటా 80.96శాతం నుంచి 85.96శాతానికిపెరిగింది. బ్యాంకు ప్రభుత్వానికి ప్రాధాన్యతా షేర్లకేటాయింపు కింద వాటాలను కేటాయించడంతో ప్రభుత్వ వాటా పెరిగింది. ఎల్‌ఐసి బోర్డు ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆమోదముద్రవేసింది. ప్రభుత్వ రంగం లోని బ్యాంకును ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థ కొనుగోలుచేయడం బహుశా బ్యాంకింగ్‌ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. అయితే ఈ వాటా విక్రయ ప్రతిపాదన ప్రభుత్వ ఆమోదం పొందినతర్వాత ఐడిబిఐ బోర్డు ముందు ప్రతిపాదిస్తుంది. బ్యాంకులో ఏ వాటా విక్ర యించాలన్నా ముందు కేబినెట్‌ ఆమోదముద్ర అవసరమవుతుంది.

ఐడిబిఐ బ్యాంకుపరంగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటికంటే అత్యంత ఎక్కువ నిరర్ధకాస్తులున్న బ్యాంకుగా నిలిచింది. ఇండియారేటింగ్స్‌ అంచనాలప్రకారం చూస్తే ఐడిబిఐ బ్యాంకు ఈనెలలో మరింత నిర్వీర్యం అవుతున్నది. స్థిరాస్థి ప్రమాణాలు కృశించిపోతు న్నట్లు అంచనావేసింది. ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకును ప్రైవేటీకరించాలనినిర్ణయించింది. గడచిన రెండేళ్లుగా ఇదే ప్రతిపాదనలతో ఉంది. బ్యాంకుకు నష్టాలు పెరిగిపోతూ రానిబాకీలు కుప్పలా పేరుకుంటున్నాయి. ఐడిబిఐ బ్యాంకు నష్టాలు ర ఊ.8237.92 కోట్లకు పెరిగాయి.

అంతకుముందు ఏడాది రూ.5158 కోట్లనుంచి భారీగా పెరిగాయి. ఐడిబిఐ బ్యాంకు నిరర్ధక ఆస్తులు అంటే మొండిబకాయిలుసైతం రెట్టింపు అయ్యాయి. 32.36శాతం గత ఏడాదినుంచి పెరిగి రూ.55,588.26 కోట్లకు పెరిగాయి. ఇక ఆర్ధికచేకూర్పు,నిధులసమీకరణ అంశాలు బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకునాల్సి ఉంది. ప్రస్తుత బ్యాంకు బోర్డు యాజమాన్యం ప్రణాళికలతో బ్యాంకు కొంతమేరరికవరీ అయ్యే అవకాశం ఉందని బ్యాంకర్లు చెపుతున్నారు. ఐడిబిఐ బ్యాంకును విక్రయించడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది.